ప్రముఖ నటి మంచు లక్ష్మి 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే షోని హోస్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి షోకి సంబంధించిన అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. లక్ష్మితో పాటు ఏ సెలబ్రిటీ అయితే ఈ షోలో పాల్గొంటారో.. వారిని మంచంపై ఇంటర్వ్యూ చేస్తుంది మంచు లక్ష్మీ.

అది కూడా రొటీన్ ఇంటర్వ్యూ టైప్ కాదండీ.. అభిమానులకు సినిమాల గురించి కంటే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని చాలా ఇంటరెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆలోచనతోనే ఈ షోని  డిజైన్ చేశారు. ఈ షోలో అక్కినేని కోడలు సమంత కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

అందులో సమంత కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో నాగచైతన్యకి మొదటి భార్య ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ మొదటి భార్య అంటే ఎవరో తెలుసా..? పిల్లో(తలగడ) అంట. చైతూ నిద్రపోయే సమయంలో ఆ పిల్లో పక్కన పెట్టుకొని పడుకుంటారట. 

చైతుని ముద్దు పెట్టుకోవాలన్నా.. మధ్యలో ఆ పిల్లో అడ్డు వస్తుంటుందని చెబుతూ సిగ్గుపడిపోయింది సమంత. పెళ్లికి ముందు సామ్, చైతూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారట. ఈ మాట మంచు లక్ష్మీ చెప్పగానే.. వెంటనే సామ్.. 'మీరు మా గురించి ఎక్కువ విషయాలు బయటపెట్టేస్తున్నారు' అంటూ కామెంట్ చేసింది.