బాలీవుడ్ రొమాంటిక్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘డుంకీ’.ఈ  మూవీ నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో లీక్ అయ్యింది. 

సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ 2023లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించబోతున్నారు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar)తో ‘జవాన్’ చిత్రంలో కింగ్ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వంలో ‘డుంకీ’ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్ గా తాప్సీ పన్ను ఆడిపాడుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ లోకేషన్ నుంచి ఓ పిక్స్ రిలీజ్ అయ్యింది.

తాజాగా రిలీజ్ అయిన ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పిక్ లో డుంకీ చిత్ర షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ మరియు తాప్సీ పన్ను లండన్ వీధుల్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. చిత్రం నుండి ఆమె ఫస్ట్ లుక్ లీక్ అయ్యిపోయింది. తాప్సీ నవ్వుతూనే ఉండటం అభిమానులను ఫిదా చేస్తోంది.
ఇద్దరూ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి జర్నీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇంతకుముందు, డుంకీ నుండి షారుఖ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో పిక్ లీక్ అవడంతో షారుఖ్ ఖాన్ అభిమానుల సంఘం ఇలా కోరుతోంది. ‘దయచేసి #Dunki’ సెట్స్ నుంచి లీక్ అయిన చిత్రాలను షేర్ చేయవద్దని, చిత్ర యూనిట్ చేసే మ్యాజిక్ ను థియేటర్ లో ఎంజాయ్ చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. చిత్రనిర్మాత, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చివరిగా సంజయ్ దత్ తో ‘మున్నాభాయ్ MBBS’, అమీర్ ఖాన్ తో‘PK’ చిత్రాలను తెరకెక్కించి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి షారుఖ్ ఖాన్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని JIO స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Scroll to load tweet…