బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని ముమ్మరం చేశారు. సల్మాన్, కత్రినా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. 

ఇప్పటికే సల్మాన్.. ప్రియాంకపై కామెంట్స్ చేయడం, సింగర్ సోనా మొహపాత్ర సల్మపై విరుచుకుపడడం వంటి విషయాలతో ఈ సినిమాకు రావల్సినంత హైప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమాని కష్టాలు చుట్టుముట్టాయి.

సినిమా టైటిల్ ని మార్చాలని కోరుతూ విపిన్ త్యాగి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. భారత్ పేరుని వాణిజ్య అవసరాల కోసం వాడుకోవడం సెక్షన్ 3 ప్రకారం ఉల్లంఘన కిందకు వస్తుందని, సినిమా పేరు మార్చాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో ఇప్పుడు సినిమా వివాదంలో పడింది. మరికొన్ని రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు టైటిల్ మార్చాలంటే కష్టమైన పనే.. ఆడియన్స్ కూడా 'భారత్'కి అలవాటు పడిపోయారు. మరి ఈ విషయంలో దర్శకనిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!