Asianet News TeluguAsianet News Telugu

185 కోట్లకు తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్‌' రైట్స్,ఎవరు తీసుకున్నారంటే...?

. జూన్ నెల మొత్తంగా ఆదిపురుష్‌ సందడి ఉండనుంది. కానీ గత 90 రోజులుగా యూట్యూబ్‌లో ఆదిపురుష్‌దే హవా నడుస్తోంది. ఒక్క యూట్యూబ్ అనే కాదు.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. 

Peoples media factory bought Adipurush rights for a massive price
Author
First Published May 28, 2023, 8:33 PM IST


 ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది చివర్లో విడుదలైన టీజర్‌ ఓ రేంజ్‌లో ట్రోల్స్‌కు గురైంది. దాంతో చిత్రయూనిట్ దెబ్బకు ఆరు నెలలు షూటింగ్‌ను వాయిదా వేసి మెరుగైన వీఎఫ్‌ఎక్స్‌ను తీర్చిదిద్దడంలో బిజి అయ్యిపోయింది. ఇక రీసంట్ గా  విడుదలైన ట్రైలర్‌కు తిరుగులేని రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌తో వచ్చిన నెగిటీవిటీ అంతా ట్రైలర్‌తో ఎగిరిపోయింది. మరో మూడు వారాల్లో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది.

తాజాగా ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాల రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ రేటుకు  సొంతం చేసుకున్నట్లు సమాచారం.  దాదాపు 185  కోట్లకు డీల్ క్లోజ్ చేసినట్లు చెప్తున్నారు. వాస్తవానికి  UV క్రియేషన్స్ వారు ఆదిపురుష్  రైట్స్ తీసుకుందామనుకున్నారు.  కానీ రాధేశ్యామ్ చిత్రానికి సంభందించి పాత రికవరీల కోసం కొనసాగుతున్న డిస్ట్రిబ్యూటర్ల చర్చల కారణంగా ప్రక్కన పెట్టేసారు. దాంతో   పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ప్రభాస్ ఈ డీల్ ని దగ్గర ఉండి చేయించాడని వినికిడి. ఈ రైట్స్ నుంచి వచ్చిన ఎమౌంట్ తో రాధేశ్యామ్ క్లియరెన్స్ లు చేస్తారని చెప్పుకుంటున్నారు.  ఇక ఈ 185 కోట్లలో నైజాం రైట్స్ నిమిత్తం 80 కోట్లకు ,ఈస్ట్ గోదావరి రైట్స్ 15 కోట్లకు,  సీడెడ్ రైట్స్ 15 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. 

ఈ సినిమా.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున, రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్  స్పీడు పెంచేసారు. ట్రైలర్, సాంగ్స్‌తో సినిమా పై ఎక్సపెక్టేషన్స్  పీక్స్‌కు తీసుకెళ్లారు. ఈ నెల 29న రామ్ సియా రామ్ అనే మరో  సాంగ్ రాబోతోంది. జూన్ 6న తిరుపతిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి జూన్ 16 వరకు థియేటర్లన్నీ రాముడిగా ఉన్న ప్రభాస్ కటౌట్స్‌తో నిండిపోనున్నాయి. జూన్ నెల మొత్తంగా ఆదిపురుష్‌ సందడి ఉండనుంది. కానీ గత 90 రోజులుగా యూట్యూబ్‌లో ఆదిపురుష్‌దే హవా నడుస్తోంది. ఒక్క యూట్యూబ్ అనే కాదు.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా అన్నింటిలోను ఆదిపురుష్‌ ట్రెండింగ్‌లో ఉంటోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios