Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రైట్స్‌ ... పెన్‌ స్టూడియోస్ కు

ఈ నేపధ్యంలో  సినిమాను అన్ని ఏరియాల బిజినెస్  ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా కు సంబంధించిన నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ మరియు శాటిలైట్‌ రైట్స్‌ ను భారీ మొత్తానికి బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియ  ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. ఈ మేరకు వారు అఫీషియల్ గా ట్వీట్ చేసారు.

Pen India acquires all-in-one rights of RRR jsp
Author
Hyderabad, First Published Apr 1, 2021, 12:32 PM IST

రాజమౌళి సినిమాలు తీయటంలోనే కాదు...తీసిన సినిమాను బిజినెస్  చేసుకోవటంలోనూ మాస్టరే. అందు నిమిత్తం సినిమా ప్రారంభమైన నాటి నుంచే ప్రమోషన్ ప్లాన్స్ చేసారు.  ప్రత్యేకమైన స్ట్రాటజీలతో ముందుకు వెళ్లారు. బిజినెస్ వర్గాలను ఎట్రాక్ట్ చేయటానికి కావాల్సిన బజ్ ఆర్ ఆర్ ఆర్ కు వచ్చేసింది. ఈ నేపధ్యంలో  సినిమాను అన్ని ఏరియాల బిజినెస్  ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా కు సంబంధించిన నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ మరియు శాటిలైట్‌ రైట్స్‌ ను భారీ మొత్తానికి బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియ  ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. ఈ మేరకు వారు అఫీషియల్ గా ట్వీట్ చేసారు.

 
బాలీవుడ్‌ లో పెద్ద సినిమాలను అందిస్తున్న పెన్ ఇండియా వారు...ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం రికార్డు స్థాయి రేట్‌ ను కోట్‌ చేసినట్లుగా చెబుతున్నారు.  ఈ సినిమా ను ఉత్తరాదిన భారీ ఎత్తున విడుదల చేస్తామని అంటున్నారు. బాహుబలి 2 ను మించి ఈ సినిమాను అక్కడ విడుదల చేసేలా ఇప్పటి నుండే పెన్‌ ఇండియా సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అక్టోబర్‌ లో ఈ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. నార్త్‌ ఇండియా బిజినెస్‌ పూర్తి అవ్వడంతో ఇక కీలకమైన సౌత్‌ ఇండియన్‌ స్టేట్స్‌ లో బిజినెస్‌ జరగాల్సి ఉంది.
  
ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ సైతం డబ్ చేసి ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం. అమెరికా, యూరప్ కంట్రీలలో ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం హాలీవుడ్ లో క్రేజ్ పుట్టించటం కోసం హాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలతో ప్రమోషన్ చేయనున్నట్లు వినికిడి. వాళ్లు ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లేందుకు సాయిం చేస్తారు. అప్పుడు బాలీవుడ్ లో మాత్రమే కాక ...హాలీవుడ్ లోనూ ఈ సినిమా గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా అక్కడవారితో బిజనెస్ చేసే అవకాసం ఉంటుంది. రాజమౌళి ఈ సారి తన సినిమాతో నెక్ట్స్ లెవిల్ చూడాలనుకుంటున్నారు.

చిత్ర విశేషాలకు వస్తే..రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరి గురువు పాత్రను అజయ్‌ పోషిస్తున్నారని సమాచారం. ఆయన పాత్ర చాలా శక్తిమంతంగా.. ఉండనుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios