ప్రముఖ ఛానెల్ వారు యాంకర్ ప్రదీప్ తో 'పెళ్లిచూపులు' షోని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ షోకి వచ్చిన అమ్మాయిలకు సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ పెరిగింది. ఈ షో విన్నర్ గా నిలిచిన జ్ఞానేశ్వరి కందిరేగులా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

ప్రస్తుతం ఈ భామ 'మిస్టర్ అండ్ మిస్' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ లో రొమాన్స్ ఘాడత కాస్త ఎక్కువైందనే చెప్పాలి. లిప్ లాక్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించింది జ్ఞానేశ్వరి. 'ఏమిటో అడగదు స్నేహం' అంటూ టీజర్ లో వినిపించిన పాట వినసొంపుగా ఉంది.

టీజర్ చివరలో 'రీకలెక్ట్ యువర్ మెమోరీస్ టు అవాయిడ్ బ్రేకప్స్' అనే క్యాప్షన్ ఇచ్చారు. నేటి యువతకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు అశోక్ రెడ్డి తెలిపారు. సెల్ఫీ వీడియోలతో తమ జీవితంలోని ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేసుకొనే అలవాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు.

వాటి నుండి ఎలా బయటపడతారనే పాయింట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాలో మొదటిపాటను విడుదల చేయనున్నారు.