త్వరలో యంగ్ హీరో నితిన్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించబోతున్నాడు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో ఓ క్రేజీ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే నితిన్ మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. కిక్, రేసుగుర్రం లాంటి చిత్రాలకు కథలు అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా ఓ క్రేజీ బ్యూటీని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 'పెళ్లి సందD' చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన కుర్ర భామ శ్రీలీల.. నితిన్, వక్కంతం వంశి చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్లు టాక్.
'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అంటున్నారు.
'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల 'ధమాకా' చిత్రంలో రవితేజ సరసన నటిస్తోంది. ఇదిలా ఉండగా నితిన్, వక్కంత వంశీ చిత్రానికి 'జూనియర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
వక్కంతం వంశీ రచయితగా సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నం బెడిసి కొట్టింది. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన నా పేరు సూర్య చిత్రం నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీనితో ఈసారి ఎలాగైనా దర్శకుడిగా నిరూపించుకోవాలని వంశీ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
