బాలీవుడ్ యాక్టర్ పాయల్ రోహత్గి ఇటీవల ఛత్రపతి శివాజీ గురించి చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో కొత్త వివాదాలకు తెరలేపింది. కులం గురించి ప్రస్తావించడంతో  నెటిజన్స్ ఆమెను గ్యాప్ లేకుండా ట్రోల్స్ తో చుక్కలు చూపిస్తున్నారు. ఫైనల్ గా ఆమె ఆ విషయంపై క్లారిటీ ఇచ్చి క్షమించమని కోరినప్పటికీ వివాదం తగ్గలేదు. 

పాయల్ కి నట జీవితంతో పాటు భక్తి ధ్యానంలో కూడా బిజీగా ఉంటుంది.  మంచి ఆధ్యాత్మికురాలు. అయితే రీసెంట్ గా ఛత్రపతి శివాజీ పెళ్లి గురించి మాట్లాడుతూ శుద్ర వర్ణలో జన్మించిన ఛత్రపతి ఆ తరువాత ఒక క్షత్రియ అమ్మాయిని పెళ్లాడి ఆ వర్ణలోకి మారాడని చెబుతూ.. ఆయన కూడా క్యాస్ట్ ని లెక్క చేయాలదని మంచి కింగ్ అంటూ పేర్కొన్నారు.  ఈ విషయంపై నెటిజన్స్ అలాగే పలువురు రాజకీయ నాయకులూ తప్పుబట్టారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలనీ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. 

కులం ప్రస్తావన మంచిది కాదని పాయల్ పై ట్రోల్స్ డోస్ పెరగడంతో ఒక్కసారిగా వార్త ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. వెంటనే ఈ విషయంపై పాయల్ క్షమాపణ తెలిపింది. నేను ఛత్రపతి శివాజీ గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలని అనుకున్నా. కానీ కొందరు దాన్ని తప్పుగా చూస్తున్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నానని పాయల్ రోహత్గి వివరణ ఇచ్చింది.