ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీని ఆకర్షించిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్.  తన హాట్ గ్లామర్ తో అవకాశాలు ఎక్కువగా అందుకుంటున్న అమ్మడు ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో పాటు మరో రెండు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. కేవలం తన పాత్రలకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాల్లో నటిస్తానని చెబుతున్న ఈ బ్యూటీ రీసెంట్ గా లేడి ఓరియెంటెడ్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

సీత సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు తేజ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ వెంటనే మరో లేడి ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ కథతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా థ్రిల్లర్ జానర్ లో ఆ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకుంటున్నాడట. 

అసలు మ్యాటర్ లోకి వస్తే తేజ త్వరలో స్టార్ట్ చేయబోయే ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సింగిల్ సిట్టింగ్ లో పాయల్ తేజ చెప్పిన పాయింట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు తమిళ్ లో కూడా ఒక లేడి ఓరియెంటెడ్ కథలో ఈ భామ నటించడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.