యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఇదే. 300 కోట్ల భారీ బడ్జెట్ లో సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. 

దాదాపుగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఇక సాంగ్స్ చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం సుజిత్ హీరోయిన్ల వేటలో పడ్డాడట. ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతలో సెగలు రేపిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సాహో స్పెషల్ సాంగ్ లో పెర్ఫామ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దర్శకుడు సుజీత్ ఇప్పటికే పాయల్ తో సంప్రదింపులు జరిపాడట. పాయల్ రాజ్ పుత్ ఇటీవల విడుదలైన సీత చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించింది. అందాలు ఆరబోయడానికి సిద్ధంగా ఉండే పాయల్ సాహో స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.