హాట్ గా,గ్లామర్ గా ఉన్నా పాపం పాయిల్ రాజ్ పుత్ కు ఆఫర్స్ రావటం లేదు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఆమె ఆ తర్వాత ఫుల్ బిజి అయ్యింది.  పాయల్‌ ‘వెంకీ మామ’, ‘డిస్కోరాజా’ సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఆ రెండు సినిమాలు ఆమెకు కలిసి రాలేదు. సరికదా ఆమెకు అన్నీ ఆంటీ పాత్రలే వస్తున్నాయని వాపోతోంది. అందుకు కారణం వెంకీ మామ సినిమాలో తన పాత్ర డిజైన్ చేసిన విధానం గోలెత్తిపోతోందిట. వెంకీ మామలో వెంకటేష్ సరసన చేసిన ఆమెకు ఇటు కుర్ర హీరోల సినిమాలు లేవు..అటు సీనియర్ హీరోల సినిమాలు లేవు. ఏవో బి గ్రేడ్ సినిమా ఆఫర్స్ రావటం ఆమెకు షాక్ ఇస్తోందిట.

అందుకు కారణం దర్శకుడు బాబి అని ఆమె ఆరోపణగా చెప్తున్నారు. డైరక్టర్ బాబి...తన పాత్రను వెంకీ మామలో చెప్పేటప్పుడు హీరోయిన్ అని చెప్పాడని, అయితే దాన్ని ఆంటీ పాత్రలా చేసాడని, నాగచైతన్య మేనమామతో ప్రేమలో ఉండే ఆంటీ పాత్ర కావటంతో అందరూ తనను అలాగే ఫిక్స్ అయ్యారని అంటోందిట. అయితే సినిమా ఒప్పుకునేటప్పుడు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అంటున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో నటిగా ఆమెను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. దర్శక, నిర్మాతలు ఆమెను కలిశారని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆ వార్తల సారాంశం. ఈ రూమర్స్ పై పాయల్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ఇవి కేవలం పుకార్లని స్పష్టం చేశారు.

‘నేను ఇప్పటి వరకు నా కొత్త సినిమాకు సంతకం చేయలేదు. బాలకృష్ణ సర్‌తో సినిమాలో నటించబోతున్నాను అని వచ్చిన వార్తల్లో నిజం లేదు’ అని చెప్పారు.   ఇప్పుడు ఆమె ‘5WS’ అనే చిత్రంలో పోలీసు హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘ఏంజెల్‌’ అనే సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌ హీరో. అదేవిధంగా ‘నరేంద్ర’ అనే తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం.