హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌.. సినిమా వివాదంలో ఇరుక్కుంది. తనని బ్యాన్‌ చేస్తామని `రక్షణ` మూవీ నిర్మాతలు బెదిరిస్తున్నట్టు వెల్లడించింది. ఆమె పోస్ట్ వైరల్‌ అవుతుంది.  

పాయల్‌ రాజ్‌పుత్‌ `ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే ఆకట్టుకుంటుంది. అందులో అద్భుతమైన నటనతో మెప్పించింది. గ్లామర్‌ ట్రీట్‌తోపాటు, నెగటివ్‌ షేడ్‌ ని చూపించి మెప్పించింది. తెలుగులో హీరోయిన్‌ పాత్రలకు సంబంధించి ఓ కొత్త పంథాని పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆ స్థాయి విజయాలు పడలేదు. 

గతేడాది `ఆర్‌ఎక్స్ 100` దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలోనే `మంగళవారం` మూవీ చేసింది. థ్రిల్లర్‌ ప్రధానంగా సాగే ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇందులో బోల్డ్ రోల్‌లో పాయల్ నటించి అదరగొట్టింది. ఒక సాహసోపేతమైన పాత్రని అవలీలగా చేసి మెప్పించింది. ఫస్ట్ మూవీ తర్వాత పాయల్ కి ఈ సినిమా విజయాన్ని అందించిందని చెప్పొచ్చు. 

అయితే తాజాగా ఆమె ఓ సినిమా వివాదంలో ఇరుక్కుంది. ఆమె నటించిన `రక్షణ` సినిమాకి సంబంధించి తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదట. మేకర్స్ రెమ్యూనరేషన్‌ ఇవ్వకుండా తెలుగులో బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నట్టు తెలిపింది. తనకు వచ్చిన సక్సెస్‌ని ఉపయోగించుకుని `రక్షణ` మూవీని విడుదల చేయాలని భావిస్తున్నట్టు ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టింది.

ఇందులో పాయల్‌ చెబుతూ, 2019-20 సమయంలో తాను `రక్షణ` అనే సినిమాలో నటించిందట. దానికి ముందు అనుకున్న టైటిల్‌ `5డబ్ల్యూఎస్‌`. ఆ సినిమా షూటింగ్‌ ఎప్పుడో అయిపోయింది. కానీ రిలీజ్‌ ఆలస్యమైంది. ఇటీవల తనకు `మంగళవారం` చిత్రంతో సక్సెస్‌ రావడంతో ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు `రక్షణ` సినిమాని విడుదల చేయాలని, ఆ సక్సెస్‌ని క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది పాయల్‌. అయితే అగ్రిమెంట్‌ ప్రకారం తనకు చెల్లించాల్సిన పారితోషికం మొత్తం ఇంకా చెల్లించలేదని, పైగా తనని ప్రమోషన్స్ లో పాల్గొనాలని డిమాండ్‌ చేస్తున్నారని, కానీ తాను కూడా అందుబాటులో లేనని ఆవిషయానికి సంబంధించి తన టీమ్ వారితో టచ్‌లోనే ఉంది.

 ప్రమోషన్స్ కి రాకపోవచ్చు, కానీ డిజిటల్‌ ప్రమోషన్స్ చేయడానికి తాను సిద్ధమే అనే విషయాన్ని వారికి కన్వే చేశారని చెప్పింది. `అయినా వాళ్లు రాజీకి రావడం లేదు. అంతేకాదు ప్రమోషన్స్ కి రాకపోతే తెలుగు పరిశ్రమలో బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ తిడుతున్నారని, తనకు చెల్లించాల్సిన పారితోషికం ఇవ్వాలని నా టీమ్‌ ఇప్పటికే చిత్ర యూనిట్‌తో చెప్పింది. కానీ వాళ్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నా పేరు, పాత్ర ఉంటే, తనని వాడుకోవాలని చూస్తే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను` అని పోస్ట్ చేసింది పాయల్‌. తనకు న్యాయం కావాలని కోరి ఇప్పుడిది నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Scroll to load tweet…

తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది పాయల్. తెలుగులో `కల్కి2898ఏడీ`లో కనిపిస్తుందని వార్తలొచ్చాయి. కానీ క్లారిటీ లేదు. దీంతోపాటు ఒకటి రెండు తెలుగు మూవీస్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు `రక్షణ` చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుంది పాయల్‌. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతుంది. రోషన్‌, మానస్‌ ఇతర పాత్రల్లో నటించారు. ప్రణదీప్‌ ఠాకోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది.