'RX100'చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మంచి క్రేజ్ ని దక్కించుకుంది. తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో యూత్ ని ఫిదా చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకునే పనిలో పడింది.

సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉండే ఈ భామ తాజాగా తన ఫ్యాన్స్ తో పాటు ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో పాయల్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

''ఓటు మన ప్రాధమిక హక్కు ఓటు వల్ల కేవలం మనల్ని ఏలడానికి నాయకులను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నామని అనుకుంటే పొరపాటు పడ్డట్లే.. మన భవిష్యత్తును  నిర్మించుకుంటున్నామనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి.

ఓటు హక్కు మన పౌరసత్వాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. మన ఒక్క ఓటు జీవితాలను మారుస్తుందా అని అనుకోకూడదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ కీలకమైనదే'' అంటూ చెప్పుకొచ్చింది.