'RX 100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాలోనే తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో షాకిచ్చింది. అందాల ఆరబోతలో, బోల్డ్ గా నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పకనే చెప్పింది. ఈ సినిమా తరువాత పాయల్ కి టాలీవుడ్ లో మంచి అవకాశాలే వచ్చాయి.

రవితేజతో 'డిస్కో రాజా' సినిమా అలానే వెంకటేష్ తో 'వెంకీ మామ' సినిమాలు చేస్తోంది. ఇవి మంచి ఆఫర్లనే చెప్పాలి. కానీ పాయల్ ఈ సినిమాను తన చేతిలోకి వచ్చేలోపే.. అడల్ట్ కంటెంట్ ఉన్న 'ఆర్డీఎక్స్ లవ్' అనే సినిమాలో నటించింది. బూతు కంటెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ మొత్తం బూతు కంటెంట్ తో నింపేశారు. పాయల్ మొహమాటాలు లేకుండా సేఫ్టీ, సెక్స్ గురించి మాట్లాడేస్తుంది. ఈ టీజర్ చూసిన వారంతా షాకవుతున్నారు. సి.కళ్యాణ్‌ లాంటి ప్రముఖ నిర్మాత నుంచి ఇలాంటి సినిమా రావడం మీడియాని కూడా ఆశ్చర్యపరుస్తోంది.

అయితే ఈ సినిమాలో పాయల్ కి వస్తోన్న ఫీడ్ బ్యాక్ 'వెంకీ మామ' చిత్రబృందాన్ని ఇబ్బంది పెడుతోందట. 'ఆర్డీఎక్స్ లవ్' సినిమా రిలీజైన తరువాత పాయల్ కి ఎలాంటి ఇమేజ్ వస్తుందో..? ఆమెతో వెంకీ రొమాన్స్ చేస్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారోననే సందేహాలు మేకర్లకు తలనొప్పిని తీసుకొస్తున్నాయి.