యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీ కాబోతున్నారు. ముందుగా ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. 

ఆర్ఆర్ఆర్ విడుదల కాకముందే ఎన్టీఆర్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. దీనితో బాలీవుడ్ భామలు ఎన్టీఆర్ నటించేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక డాషింగ్ బ్యూటీ దీపికా పదుకొనె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎన్టీఆర్ తో నటించాలని ఉన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా దీపికా ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది. 

దీని గురించి నటి పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమన్నా, ఎన్టీఆర్ కలసి నటించిన ఊసరవెల్లి చిత్రం 2011లో విడుదలయింది. ఆ మూవీలో పాయల్ ఘోష్ కూడా కీలక పాత్రలో నటించింది. అప్పటి నుంచి పాయల్ ఘోష్ కి ఎన్టీఆర్ పై అభిమానం ఏర్పడింది. 

ఎన్టీఆర్ గురించి దీపికా పదుకొనె చేసిన కామెంట్స్ పై పాయల్ ఘోష్ స్పందించింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లంతా ఎన్టీఆర్ తో నటించాలని చచ్చిపోతున్నారు. ఎన్టీఆర్ తో నేను ఆల్రెడీ నటించినందుకు సంతోషంగా ఉంది. సౌత్ సినిమా బాలీవుడ్ ని మించిపోతుందని గతంలోనే చెప్పాను. అప్పుడు నన్ను విమర్శించారు. ఇప్పుడు అదే నిజమవుతోంది అని పాయల్ ఘోష్ కామెంట్స్ చేసింది. 

Scroll to load tweet…