ఈ సినిమాకు కొందరి పెదవి విరుపులు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ఈ సినిమాని మెచ్చుకునేవారే ఉన్నారు.  ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసింది..


ప్రభాస్‌ (Prabhas)తాజా చిత్రం ‘సలార్’ (Salaar) చిత్రం రెండో వారంలోకి ప్రవేశించింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్స్ చూస్తోంది. వీకెండ్ లో రిపీట్ ఆడియన్స్ థియేటర్లలోకి సందడి చేస్తోంది. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యిన ఈ చిత్రం తెలుగు USA, గల్ప్ కంట్రీలలోనూ తన సత్తా చూపుతోంది. అయితే ఈ సినిమాకు కొందరి పెదవి విరుపులు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ఈ సినిమాని మెచ్చుకునేవారే ఉన్నారు. తాజాగా ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసింది పాయిల్ ఘోష్. ఆమె కామెంట్స్ మూడు రోజులైనా ఇప్పుడు యాంటి ఫ్యాన్స్ కొందరు ఆ కామెంట్స్ ని వైరల్ చేయటంతో మరోసారి వార్తల్లో నిలిచింది. 

 మంచు మనోజ్‌ ‘ప్రయాణం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది కోల్‌కతా బ్యూటీ పాయల్‌ ఘోష్‌. ఆ తర్వాత ఊసర వెల్లి, మిస్కర్‌ రాస్కెల్‌ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది పాయల్‌. కానీ గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తోంది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్‌ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పాయల్‌ షేర్‌ చేసే సోషల్‌ మీడియా పోస్టులు కూడా వైరలవుతున్నాయి. తాజగా రిలీజైన ప్రభాస్‌ సలార్‌, షారుఖ్‌ ఖాన్‌ డంకీ సినిమాలను విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టింది. 

ఆ పోస్ట్ లో ఏముంది అంటే...‘2023లో విడుదలైన సినిమాలన్నీ చెత్తగా ఉన్నాయి. ఒక్కటీ కూడా చూడలేని విధంగా ఉన్నాయి. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్‌లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. అయితే సలార్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తాయి. ఎందుకంటే ప్రభాస్‌ యంగ్ అండ్ పవర్‌ఫుల్‌ పర్సన్. ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది’ అని ట్వీట్లు చేసింది పాయల్ ఘోష్‌.

అలాగే ‘ పఠాన్‌, జవాన్‌, యానిమల్‌ సినిమాలు కూడా బాగోలేవు. అన్నీ జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయి’ అని ట్వీట్లలో రాసుకొచ్చింది పాయల్‌ ఘోష్‌. ప్రస్తుతం పాయల్‌ ట్వీట్స్‌ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది.