సాబ్..షూటింగ్ ఫినిష్ చేసి ఫలితం ఏముంది?
త్రివిక్రమ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా ప్రారంభమై పరుగులు పెట్టింది.
‘వకీల్‌సాబ్’ షూటింగ్ ను మంగళవారం పూర్తి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్ లో పవన్‌పై కొన్ని కీ సీన్స్ తెరకెక్కించారు. వాటితో ఆయనపై తీయాల్సిన సీన్స్ పూర్తయినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ‘వకీల్‌సాబ్’ సెట్లో పవన్‌కల్యాణ్‌కి ఆఖరి రోజు కావడంతో, చిత్ర టీమ్ అంతా ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడింత అర్జెంట్ గా షూటింగ్ పూర్తి చేసినా ఫలితం ఏముంది అంటున్నారు సినిమా జనం. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ కు పెట్టడం లేదు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వటం లేదు. దాంతో ఇప్పుడు డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెట్టుకోవటం లేదు. అందరూ చెప్పుకునే దాని ప్రకారం ఈ సినిమాని ఏప్రియల్ 9 న వేసవి కానుకగా రిలీజ్ చేస్తారు. ఏదైమైనా సంక్రాంతి సీజన్ ని మిస్ చేసుకోవటం ఫ్యాన్స్ ని నిరాశలో ముంచేస్తోంది.
త్రివిక్రమ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా ప్రారంభమై పరుగులు పెట్టింది.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్ , కెమెరా: పి.ఎస్. వినోద్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి.