భార్యాపిల్లలతో సహా చిరుని కలిసిన పవన్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 22, Aug 2018, 3:21 PM IST
pawan with family meets chiranjeevi
Highlights

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన 'సై రా నరసింహారెడ్డి' టీజర్ తో మెగాభిమానుల సంబరాలు మొదలైపోయాయి

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన 'సై రా నరసింహారెడ్డి' టీజర్ తో మెగాభిమానుల సంబరాలు మొదలైపోయాయి. అభిమానుల సమక్షంలో నిన్న సాయత్రం శిల్పకళావేదికలో చిరు పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ఇక ఈరోజు చిరంజీవి ఇంటికి ఆయన సన్నిహితులు, స్నేహితులు వెళ్లి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన అన్నయ్యను కలవడానికి పవన్ కుటుంబంతో సహా చిరు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. భార్య ఇద్దరి పిల్లలను తీసుకొని అన్నను కలిసి ప్రత్యేకంగా కానుకలు కూడా అందించాడు పవన్. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో పవన్ చిన్న కొడుకు కూడా ఉన్నాడు. తన అన్న మీద ఉన్న అభిమానంతో తన కొడుకుకి ఆయన పేరు కలిసొచ్చేలా మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరుని పెట్టిన సంగతి తెలిసిందే. 

ఇవి కూడా చదవండి.. 

మెగాస్టార్ జీవితంలో కొన్ని సీక్రెట్స్!

సుబ్బిరామిరెడ్డితో చిరు భేటీ!

పవన్ అలా చేసేసరికి ఏడుపొచ్చేసింది.. తనతో గొడవ పడ్డా: సుప్రియ

'సై రా' టీజర్ చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?

loader