పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి ఓ పీరియాడిక్ చిత్రం చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ తో ఆయన చేస్తున్న మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుంది. మొఘలుల కాలంనాటి కథలో పవన్ బందిపోటు దొంగగా కనిపిస్తారనేది ఇండస్ట్రీ టాక్. అందుకే ఈ చిత్రం కోసం బందిపోటు, గజదొంగ, విరూపాక్ష అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలుకాగా లాక్ డౌన్ తో బ్రేక్ పడింది. వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ తో పాటు పవన్ ఈ మూవీ షూట్ లో పాల్గొన్నారు. 

ఐతే ఇప్పుడు పవన్ ఫస్ట్ ప్రయారిటీ వకీల్ సాబ్ అని తెలుస్తుంది. మొదట వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలనేది ఆయన ఆలోచనట. అందుకే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి అయ్యేవరకు క్రిష్ చిత్ర షూటింగ్ లో ఆయన పాల్గొనరట. ఎటూ వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరింది. మరో 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. హీరోయిన్ శృతి హాసన్ తో కాంబినేషన్ సన్నివేశాలు, ఓ సాంగ్ మరియు కొన్ని కోర్ట్ రూమ్ సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలివుంది. కాబట్టి వకీల్ సాబ్ పూర్తి చేయడానికి పూర్తిగా ఓ నెల కేటాయించాలని పవన్ అనుకుంటున్నారట. 

దీనితో క్రిష్ మూవీ షూట్ వకీల్ సాబ్ పూర్తి అయిన తరువాతే అని తాజా సమాచారం.ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా తెలియజేశారట. ఇక పవన్ నటిస్తున్న ఫస్ట్ పీరియాడిక్ చిత్రం కావటంతో ఫ్యాన్స్ కి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో దొంగగా పవన్ లుక్ సరికొత్తగా ఉండనుందని సమాచారం. అలాగే ఈ మూవీతో పవన్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నడనేది టాలీవుడ్ టాక్.