ప్రస్తుతం లాయిర్ సాబ్ రీమేక్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో రీమేక్ చేయటానికి ఉత్సాహం చూపెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఆ రీమేక్ ని త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తారని వినపడుతోంది. ఈ మేరకు పవన్,త్రివిక్రమ్ కలిసి ఆ సినిమా చూసారని, తెలుగులో ఏం మార్పులు చేస్తే బాగుంటుందో త్రివిక్రమ్ చెప్పిన విధానం చూసి ముగ్దుడైన పవన్ ...ప్రాజెక్టుపై వర్కవుట్ చేయమని పురమాయించారట. ఇంతకీ ఆ రీమేక్ ఏమిటి..ఆ విషయమేంటో చూద్దాం. 

 స‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ద‌క్కించుకున్నార‌ు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. త్రివిక్రమ్ కు సితార ఎంటర్టైన్మెంట్స్ కు ఉన్న అనుబంధంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కే అవకాసం ఉంది.
 
మరో ప్రక్క ..సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.  ప్ర‌స్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌ల‌తో రంగ్‌దే, నానితో శ్యామ్ సింగ‌రాయ్‌. నాగ‌శౌర్య‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్‌దే , శ్యామ్ సింగ‌రాయ్‌ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.