షాక్.! పవన్ కొత్త ఛానెల్.?

pawan planning for a new channel
Highlights

షాక్.! పవన్ కొత్త ఛానెల్ పెడుతున్నాడు... పేరు ఏంటో తెలుసా.?

 శ్రీరెడ్డి వ్యవహారంలో తప్పంతా తనదే అంటూ రాంగోపాల్ వర్మ ఒప్పుకున్నా.. దీని వెనక రాజకీయ కోణం ఉందంటున్నాడు జనసేన అధినేత. అయితే.. ఇదంతా మీడియా సపోర్ట్ తో జరుగుతోందని కూడా చెప్పుకొచ్చాడు. పవన్ ఈ విషయంలో ఎంత హర్ట్ అయ్యాడో అర్థం అయిపోతుంది.

పవన్ కు ఇప్పటి వరకు సపోటర్స్ గా నిలిచిన ఛానెల్స్ ఏమీ లేవు. ఆ లోటు పవన్ కు కూడా అర్ధం అయ్యింది కానీ.. ఓ మీడియా ఛానల్ ప్రారంభించాలనే పాయింట్ ను మాత్రం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆలోచన ఓ కొలిక్కి వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో జే టీవీ అనే ఓ బ్యానర్ చక్కర్లు కొడుతోంది. 'జనం కోసం' ఇది ఛానల్ పేరు కాగా.. 'మీ కోసం.. మీ తోడుగా..' ఈ క్యాప్షన్ తో జే టీవీ అనే ఛానల్ రాబోతోందని ఈ పోస్టర్ సారాంశం. ఇందులో వాస్తవం ఎంత అనే విషయం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. మరీ ఈ జే టీవి గురించి తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.
 

loader