‘బిల్లా’ గా పవన్..క్లూ ఇచ్చారు గమనించారా?
ఆ సినిమాలో బిల్లాగా పవన్ కనిపించబోతున్నారు. ఆయన కనిపించబోయే పాత్ర పేరు బిల్లా. అలాగే సినిమాకు చాలా ఇంట్రస్టింగ్ టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. సినిమా టైటిల్ కు సంబంధించిన క్లూను నిన్న రిలీజ్ చేసిన వీడియోలో వినిపించింది అని కూడా అంటున్నారు.
‘తెలుగు సినిమా అభిమాన పోలీస్ ఈజ్ బ్యాక్ ఇన్ ఏ హై ఓల్టేజ్ రోల్’ అంటూ పవన్ కల్యాణ్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. అయితే చిత్రటీమ్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఆ సినిమాలో బిల్లాగా పవన్ కనిపించబోతున్నారు. ఆయన కనిపించబోయే పాత్ర పేరు బిల్లా. అలాగే సినిమాకు చాలా ఇంట్రస్టింగ్ టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. సినిమా టైటిల్ కు సంబంధించిన క్లూను నిన్న రిలీజ్ చేసిన వీడియోలో వినిపించింది అని కూడా అంటున్నారు.
వాస్తవానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.12గా సిద్ధమవుతున్న ఈ సినిమా పూర్తి వివరాలు రివీల్ చేయలేదు. అయితే ఇది మలయాళంలో మంచి విజయం అందుకున్న ‘అయ్యప్పన్ కొషియమ్’కు రీమేక్ అని తెలుస్తోంది. అందులో బిజు మేనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోసిస్తున్నారని చెప్తున్నారూు. అలాగే మరో కీలక పాత్రలో రానా నటిస్తాడని వినికిడి. ఈ పాత్రను మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించారు.
ఈ నేపధ్యంలో ఈ సినిమాకు అలనాటి హిట్ సినిమా ‘బిల్లా రంగా’ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాంతో ఇందులో పవన్ పేరు బిల్లా అనే వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన మరో కీలక పాత్రధారి రానా పేరు రంగా అవుతుంది. నిన్న విడుదలైన వీడియోలో బ్యాగ్రౌండ్‌లో ‘బిల్లా.. రంగా’ అనే వాయిస్ వినిపిస్తోంది. అలా ఇదే సినిమా పేరు అని నెటిజన్లు అనుకుంటున్నారు. 1982లో వచ్చిన ‘బిల్లా రంగా’లో చిరంజీవి, మోహన్‌బాబు నటించిన విషయం తెలిసిందే. అలా కెరీర్‌లో రెండోసారి పవన్... అన్నయ్య చిరంజీవి సినిమా టైటిల్‌ను వాడుకుంటున్నాడన్నమాట.
ఈ చిత్రంలో హీరోలు ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే సన్నివేశాలున్నాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’లోనూ అటువంటి సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. అందుకని, రవితేజ-రానా హీరోయిజమ్ తగ్గకుండా సాగర్ చంద్ర సినిమా తీయగలడని భావిస్తున్నారట. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలయాళ కథపై స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం.
నారా రోహిత్, శ్రీ విష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో విజయం అందుకున్నారీ యువ దర్శకుడు. అంతకు ముందు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా ‘అయ్యారే’ కూడా తీశారు. అయితే... ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు నచ్చడంతో పవన్, రానా చిత్రాన్ని సాగర్ కె. చంద్ర చేతుల్లో పెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భావిస్తోందట.