Asianet News TeluguAsianet News Telugu

‘విక్రమార్కుడు’ని పవన్ చేయకపోవటం కారణం ఇదే

. విక్రమార్కుడు సినిమాకు అప్పట్లో రవితేజ కెరీర్‌లోనే హైయ్యస్ట్ 11 కోట్లు పెట్టారు. 14 కోట్ల బిజినెస్ చేశారు. భారీ అంచనాల మధ్య 180 ప్రింట్లతో విడుదలైన విక్రమార్కుడు.. 26 కోట్లు వసూలు చేసింది. 

Pawan Kalyans Reason Behind Not Doing Vikramakudu jsp
Author
Hyderabad, First Published Jun 29, 2021, 6:06 PM IST

రవితేజ ద్విపాత్రాభినయం చేసిన విక్రమార్కుడు అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ మధ్యనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. దాంతో అందరూ ఈ సినిమాని గుర్తు చేసుకున్నారు. విక్రమార్కుడు ఎంత పెద్ద సక్సెస్ అంటే..అప్పటి వరకు 20 కోట్ల మార్కెట్ లేని రవితేజకు ఈ సినిమాతో ఆ మార్కెట్ వచ్చేసింది. స్టార్ నుంచి సూపర్ హీరోగా మారిపోయారు మాస్ రాజా. ఈ సినిమాను మాస్ ఆడియన్స్‌కు రవితేజను మరింత చేరువ చేసింది. మరోవైపు విక్రమార్కుడు బెస్ట్ పోలీస్ డ్రామాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే విక్రమ్ సింగ్ రాథోడ్ కారెక్టర్ అయితే అదిరిపోతుంది.

 జింతాక్ తాక్ అంటూ కామెడీతో నవ్వించాడు సత్తిబాబు. అంతేకాదు తెలుగులో వచ్చిన తర్వాత 5 భాషల్లో రీమేక్ అయింది విక్రమార్కుడు. . విక్రమార్కుడు సినిమాకు అప్పట్లో రవితేజ కెరీర్‌లోనే హైయ్యస్ట్ 11 కోట్లు పెట్టారు. 14 కోట్ల బిజినెస్ చేశారు. భారీ అంచనాల మధ్య 180 ప్రింట్లతో విడుదలైన విక్రమార్కుడు.. 26 కోట్లు వసూలు చేసింది. ఈ రేంజి సినిమా ని అసలు పవన్ కళ్యాణ్ చేయాలి మొదట. ఈ కథను మొదట పవన్ కు చెప్పారు. అయితే పవన్ ఎందుకు చేయలేదు ఆ విషయాలు చూద్దాం.

 ఛత్రపతి సినిమాతో హిట్ కొట్టిన తర్వాత రాజమౌళి తనే సొంతంగా ఒక బ్యానర్ మొదలు పెట్టి సినిమా చేయాలనుకున్నారు. అలా మొదలు పెట్టిన బ్యానర్‌లో ఎన్టీఆర్‌తోనే తొలి సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు కథ చెప్పారు. ఆ కథ నచ్చి పవన్ తో చేద్దామనుకున్నారు రాజమౌళి. ఆయన్ను ఎప్రోచ్ అయ్యారు. విజియేంద్ర ప్రసాద్ చెప్పిన కథను పవన్ కళ్యాణ్ విన్నారు. కథ నచ్చింది. అయితే అప్పుడే బంగారం సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత అన్నవరం సినిమా కూడా లైన్ లో పెట్టేసారు. దాంతో పవన్ కళ్యాణ్ కొద్ది కాలం గ్యాప్ తీసుకుందామనుకుంటున్నానని, ప్రస్తుతం చేయలేనని అన్నారు. ఆ విషయాన్ని రాజమౌళికి చెప్పారు. దాంతో రాజమౌళి ఆ లైన్ ని రవితేజ కు చెప్పి పట్టాలు ఎక్కించేసారు.
 
 ఈ సినిమా రిలీజ్ అప్పుడు మొదట డివైడ్ టాక్ తెచ్చకున్నా మాస్ కు పట్టేసి పెద్ద హిట్టైంది. ఈ  కథ ఎంతోమందిని అలరించింది. కన్నడలో సుదీప్ హీరోగా ‘వీర మదకరి’గానూ, తమిళంలో కార్తీ హీరోగా ‘సిరుతై’గానూ, హిందీలో అక్షయ్ కుమార్ తో ‘రౌడీ రాథోడ్’గానూ తెరకెక్కి మురిపించింది. ఇక బెంగాల్ లో ‘బిక్రమ్ సింగ: ద లయన్ ఈజ్ బ్యాక్’ పేరుతో తెరకెక్కి, బెంగాలీయులనూ ఆకట్టుకుంది. మరో విశేషమేమంటే, బంగ్లాదేశ్ బెంగాలీలో అయితే, ఈ సినిమా కథ 2007లో ‘ఉల్టా పల్టా 69’గానూ, తరువాత 2015లో ‘యాక్షన్ జాస్మిన్’గానూ రూపొందింది.

Follow Us:
Download App:
  • android
  • ios