"పవన్ కల్యాణ్ నాపై కవిత్వాలు రాసేవారు. అవి నాకు పంపించేవారు. నా వాలుజడపై, పక్క నుంచి చూసే చూపులపై రాసేవారు. అంత పెద్ద హీరో నాపై కవితలు రాస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఆయనతో నటించేటప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. అదంతా సెట్స్ లో సరదాగా జరిగేది. అలా సెట్స్ లో చాలామంది నన్ను ట్రై చేసేవారు. అంతా పైపైన ఫ్లర్టింగ్ టైపు అన్నమాట. ఎవరూ పర్సనల్ గా తీసుకోలేదు." అంటోంది మరెవరో కాదు తెలుగు క్యారక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి.

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో గుర్తింపు తెచ్చుకున్న న‌టి జ్యోతి. హంగామా, పెళ్లాం ఊరెళితే లాంటి సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన జ్యోతి అప్ప‌ట్లో వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉండేది. ఇక ప్రస్తుతం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ అల‌రిస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్ సీజ‌న్ 1 లో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.  ఆమె తాజాగా ఓ ఇంట‌ర్యూలో ఈ  ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి...సినిమా జీవితం గురించి పలు విష‌యాల‌ను పంచుకుంది. వైజాగ్ కు చెందిన జ్యోతి ప‌ద్దెనిమిదేళ్ల‌కే సినిమా అవ‌కాశాల కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చింద‌ట‌. అవ‌కాశాల కోసం మొద‌ట్లో చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాన‌ని జ్యోతి చెప్పుకొచ్చింది.

 మరోవైపు తన పర్శనల్ విషయాలపై కూడా స్పందించింది. తన భర్త తన నుంచి విడిపోయాడని, ఆ టైమ్ లో కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటోంది. జ్యోతి కూడా కరోనా బారిన పడింది. కేర్ హాస్పిటల్ లో కరోనా వార్డులో ఒంటరిగా గడిపింది. దీంతో తనకు కూడా తోడు ఉంటే బాగుండేదని అనిపించిందని చెప్పుకొచ్చింది.