మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మరో హీరోగా రానా నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోనే పవన్‌ ఓ పాట పాడబోతున్నాడట. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ని మరోసారి అలరించబోతున్నాడు. అంటే నటనతో కాదు. పాటతో అభిమానులను ఉర్రూతలూగించబోతున్నారట. మరోసారి ఆయన తన సినిమాలో పాటపాడబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇది ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. దీంతోపాటు మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మరో హీరోగా రానా నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రంలోనే పవన్‌ ఓ పాట పాడబోతున్నాడట. `వకీల్‌సాబ్‌` ప్రమోషన్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ వెల్లడించారు. తన అభిమానులను పాటతో మరోసారి ఉర్రూతలూగించాలని పవన్‌ భావిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ `ఖుషీ`, `జానీ`, `గుడుంబా శంకర్‌`, `అత్తారింటికి దారేదీ`, `అజ్ఞాతవాసి` చిత్రాల్లో పాటలు పాడారు. అవి ఫ్యాన్స్ ని ఎంతగానే అలరించాయి. దీంతో `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లోనూ పాటతో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయాలని పవన్‌ నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉంటే ఇందులో ఆయనకు జోడిగా ఇంకా హీరోయిన్‌ ఫిక్స్ కాలేదు. రానాకి ఐశ్వర్య రాజేష్‌ పేరు వినిపిస్తుంది. పవన్‌ సరసన నటించే హీరోయిన్‌ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదట. అసలు హీరోయిన్‌ ఉంటుందా లేదా అన్నసందేశాలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ఇటీవల 67వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలకు పవన్‌ అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా మహేష్‌ నటించిన `మహర్షి` చిత్రానికి, మహేష్‌కి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో వచ్చిన `జెర్సీ` చిత్రం కూడా రెండు జాతీయఅవార్డులు దక్కించుకుంది. దీంతో `జెర్సీ` సినిమాకి కూడా ఆయన అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు ఇచ్చిన స్ఫూర్తితో వీరి మరింత మంచి సినిమాలు చేయాలన్నారు.