పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు

First Published 22, Jan 2018, 5:07 PM IST
pawan kalyan wife leginova special attraction while his political tour
Highlights
  • పవన్ రాజకీయ యాత్ర నేటి నుంచి ప్రారంభం
  • వస్తున్నా ఆశీర్వదించండి అంటూ తెలుగు నేల బిడ్డలను కోరిన పవన్
  • పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం సందర్భంగా ఆకట్టుకున్న ఆయన సతీమణి లెజినోవా

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పోలెండ్ దేశస్తురాలని తెలిసిందే. ఇటీవలే పోలెండ్ ఎంబాజిడర్ ఆడమ్ దంపతులతో కూడా పవన్, లెజినోవా దంపతులు భేటీ అయి పలు చారిత్రక, సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చర్చిలోనూ ప్రార్థనలు జరిపిన దృశ్యాలు అంతా చూశాం.

 

స్వతహాగా పోలెండ్ దేశస్తురాలైన లెజినోవా... పవన్ ను వివాహం చేసుకున్న తర్వాత ఒకటీ రెండు సార్లు తప్ప పబ్లిక్ లోకి పెద్దగా వచ్చిన సందర్భాలు లేవు. అప్పుడో ఇప్పుడో మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో మాత్రమే లెజినోవా కనిపించింది. అయితే.. తాజాగా జనసేనాని చలొరె చలొరె చల్ అంటూ మొదలు పెట్టిన రాజకీయ యాత్ర సందర్భంగా లెజినోవా గురించే అందరూ చర్చించుకోవడం గమనార్హం. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాల పట్ల తనకున్న గౌరవం, మక్కువ ఏంటో నిరూపిస్తూ లెజినోవా అందర్నీ అబ్బురపరిచి హాటా టాపిక్ గా మారింది.

 

పవన్ సతీమణి లెజినోవా ఇప్పుడు తెలుగు లోగిళ్లలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం సందర్భంగా లెజినోవా దగ్గరుండి పవన్ కు హారతి పట్టి దిష్టితీసి, వీర తిలకం దిద్ది రాజకీయ కదన రంగానికి పంపడం చూస్తే ఔరా అనిపించింది. సాంప్రదాయబద్దంగా తెలుగింటి ఆడపడుచులా కట్టూబొట్టుతో... అచ్చతెలుగు ఆడపడుతులా చీర కట్టుకుని... పవన్ ను రాజకీయ యాత్రకు సాగనంపుతూ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తమ వదినమ్మ ఎక్కడో పోలెండ్ దేశం నుంచి వచ్చినా... ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలకు విలువనివ్వటం పట్ల తెగ సంబరపడిపోతున్నారు.

 

పవన్ ను పెళ్లి చేసుకున్న లెజినోవా ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తెలుగింటి ప్రతిరూపంలా కట్టూబొట్టుతో పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రకు బయల్దేరే సమయంలో హారతి పట్టి కొబ్బరికాయ కొట్టి తెలుగుంటి ఆడపడుచులా ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను ఆకళింపు చేసుకున్న యువతిలా ఆదర్శవంతంగా నిలిచిందనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం కావటం ప్రత్యర్థి రాజకీయపక్షాలకు షాకింగ్ గా మారింది.

loader