గత కొద్ది నెలలుగా ఎలక్షన్స్ హడావిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ సినీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. అయితే మే 23 న ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే వరకూ రాజకీయాల పరంగా పవన్ కు ఖాళీనే. దాంతో హైదరాబాద్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్న ఆయన తిరిగి తన సినిమా ప్రపంచం వైపు తన దృష్టి సారించారు. అందులో భాగంగా మొదట ఓ సినిమాని చూసారు. ఆ సినిమా మరెవరో కాదు తన మేనల్లుడు సాయి తేజ ది. 

ఎంతోకాలంగా హిట్ కోసం కళ్లు కాయిలు కాసేలా ఎదురుచూస్తున్న సాయి తేజకు రీసెంట్ గా చిత్రలహరి రూపంలో రిలీఫ్ దొరికింది. మెగా హిట్ కాకపోయినా సాయి గత చిత్రాల కన్నా బెస్ట్ అనిపించుకుంది. అలాగే కలెక్షన్స్ సైతం డీసెంట్ గా ఉన్నాయి. ఈ  విషయం పవన్ కు చాలా ఆనందాన్ని ఇచ్చింది. 

ఎందుకంటే మొదట సినిమా నుంచి సాయి ని వెనక ఉండి నడిపించింది పవనే.అతడిని హీరోగా పరిచయం చేయాలని చూసింది కూడా పవన్‌ కళ్యాణే. వైవిఎస్‌ అతడిని రేయ్‌లో హీరోగా తీసుకున్నది కూడా పవన్‌ చెప్పడం వల్లే.  దాంతో ఎట్టకేలకు తిరిగి తన మేనల్లుడు పట్టాలు ఎక్కడటంతో పవన్ ఖుషీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా గురించి మీడియాతో పవన్ మాట్లాడబోతున్నారని వినిపిస్తోంది. 

అలాగే ఎలక్షన్స్ ప్రచారం కలిసొచ్చేలా తన మామయ్య పార్టీ కు ఉపయోగపడేలా 'గ్లాస్‌మేట్స్‌' అంటూ 'చిత్రలహరి'లో ఒక పాట పెట్టారు.  పవన్‌కళ్యాణ్‌ పార్టీ గుర్తు గాజు గ్లాస్‌  కావడంతో ఈ 'గ్లాస్‌మేట్స్‌' పాటని జనసైనికులు కనక్ట్‌ అయ్యేలా ప్రమోట్‌ చేసారు. ఈ సాంగ్‌ విడుదలకి సంబంధించిన పోస్టర్‌లో కూడా పవన్‌ పార్టీ గుర్తు హైలైట్‌ అయ్యేలా చూడటం   గమనార్హం. ఇదీ పవన్ ని సంతోషపరిచిందని సమాచారం.