పాలిటిక్స్ లో ట్రిక్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక దానిపై మీడియా విశ్లేషణ ఇవ్వడం అనేది ఈ రోజుల్లో ఎలాంటి పక్షపాత ధోరణితో నడుస్తున్నారో అందరికి తెలిసిందే. పార్టీకో ఛానెల్ ఉండడంతో మరికొన్ని ఛానెల్స్ కూడా  ఎలక్షన్స్ మూమెంట్ లో మద్దతు పలుకుతూ క్యాష్ చేసుకుంటున్నాయి. 

అసలు విషయంలోకి వస్తే.. పొలిటికల్ గ్రౌండ్ లో జనసేన బలం ఎంతో గాని పవన్ కు మీడియా మద్దతు చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. పది మంది కూడా లేని పాల్ వెనుక మీడియా వారు సవారీలు చేస్తూ తెగ పేరడీలు చేస్తున్నారు.  పవన్ సభలకు జనాలు ఎంత మంది వస్తున్నా అది పాల్ కు వచ్చే జనల జాతర కంటే 100రేట్లు ఎక్కువే. 

ఓ విధంగా కెఏ.పాల్ రేంజ్ సోషల్ మీడియాలో  ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవన్ ఎన్ని పంచ్ లు వేస్తున్నాకూడా పట్టించుకోని మీడియా కెఏ.పాల్ డైలాగ్స్ తో యూ ట్యూబ్ లో పబ్బం గడుపుకుంటున్నట్లు క్లారిటీగా అర్ధమవుతోంది. ఇక జనాలు పాల్ ఎన్ని పంచ్ లు వేస్తున్నా కామెడీ కామెంట్స్ తో మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు. 

మొత్తానికి పవన్ సభలకు మీడియా సపోర్ట్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అందుకేనేమో పవన్ ముందు జాగ్రత్తగా చిన్న తరహా ఛానెల్స్ సపోర్ట్ తీసుకున్నాడు. అయితే పెద్ద ఛానెల్స్ మాత్రం పవన్ పంచ్ ల కన్నా.. పాల్ కామెడీ బెటర్ అంటూ ముందుకు సాగుతున్నట్లు జనాలు కామెంట్స్ చేస్తున్నారు