పవన్‌ కళ్యాణ్‌ రెండేళ్ల గ్యాప్‌తో `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది బాలీవుడ్‌ సినిమా `పింక్‌`కి రీమేక్‌. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించబోతుంది. నివేదా థామస్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేజర్‌ పార్ట్ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో షూటింగ్‌ స్టార్ట్ చేయాలని, సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో బాలకృష్ణ పోటీ పడబోతున్నాడట. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కూడా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించి వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. దీన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి  నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

అయితే సంక్రాంతికి మూడు, నాలుగు సినిమాలు వచ్చినా ఆడుతుంటాయి. బాగుంటే రికార్డ్ కలెక్షన్లని రాబడుతుంటాయి. ఈ సంక్రాంతికి అదే జరిగింది. కానీ వచ్చే సంక్రాంతి ఎలా ఉంటుందనేది సస్పెన్స్ నెలకొంది. కరోనా వల్ల థియేటర్లు ఇప్పట్లో ఓపెన్‌ అయ్యేలా లేదు. అవి ఎప్పుడు ఓపెన్‌ అవుతాయో అనేదాంట్లో క్లారిటీ లేదు. ఒకవేళ ఈ ఏడాది చివరి వరకు విడుదలైనా ఆడియెన్స్ వస్తారా? రారా? అనేది సస్పెన్స్. 

ఇలాంటి పరిస్థితుల్లో రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో పోటీపడితే ఫలితం ఎలా ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. అయితే రెండేళ్ళ తర్వాత పవన్‌ వస్తుండటంతో పవర్‌ స్టార్‌ ప్రభంజనం ముందు బాలయ్య నిలబడతాడా? అనే ప్రశ్న సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది.అయితే  బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉంది. పైగా ఇప్పుడు హ్యాట్రిక్‌ చిత్రం రాబోతుంది. దీంతో ఓ వైపు పవన్‌ సినిమా, మరోవైపు బాలయ్య చిత్రంతో బాక్సాఫీస్‌ షేక్‌ కావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.