Asianet News TeluguAsianet News Telugu

`వకీల్‌సాబ్‌` ట్రైలర్‌ టైమ్‌, ప్లేసెస్‌ ఫిక్స్..పవన్‌ సినిమాకి అభిమానులే గెస్ట్ లు

హోలీ పండుగని పురస్కరించుకుని నేడు(సోమవారం) ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఫ్యాన్స్ కి బిగ్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఈ రోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సుదర్శన్‌ 35ఎంఎంలో మెయిన్‌ ఈవెంట్‌గా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. 

pawan kalyan vakeel saab trailer release time and places fix  arj
Author
Hyderabad, First Published Mar 29, 2021, 8:03 AM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న చిత్రం `వకీల్‌సాబ్‌` రిలీజ్‌కి రెడీ అవుతుంది. హోలీ పండుగని పురస్కరించుకుని నేడు(సోమవారం) ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఫ్యాన్స్ కి బిగ్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఈ రోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సుదర్శన్‌ 35ఎంఎంలో మెయిన్‌ ఈవెంట్‌గా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. అంతే కాదు రెండు తెలుగు రాష్టాల్లోని ప్రధాన పట్టణాల్లో ట్రైలర్‌ని ఒకే సమయంలో ప్రదర్శించనున్నారు. అభిమానులచేత ఈ ట్రైలర్‌ని విడుదల చేయించడం విశేషం. 

 ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా విడుదల కాబోతోంది. ఆ థియేటర్స్ లిస్ట్ ను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఆ థియేటర్స్ లిస్ట్ చూస్తే.. నైజాం - ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ - సుదర్శన్ 35ఎంఎం, వరంగల్ - రాధిక, ఖమ్మం - శ్రీ తిరుమల, కరీంనగర్ - మమత, నల్గొండ - నటరాజ్, మిర్యాలగూడ - రాఘవ, నిజామాబాద్ - లలిత మహల్, మహబూబ్ నగర్ - శ్రీనివాస, అదిలాబాద్ - మహేశ్వరి, సూర్యాపేట - కిషోర్.

వైజాగ్ - సంగం, గోపాలపట్నం - మౌర్య, గాజువాక (మిండి) - గ్లోబెక్స్, మధురవాడ - ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం - ఎస్వీసీ లికిత, విజయనగరం - ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం - ఎస్వీసీ రామ్ లక్ష్మణ,అనకాపల్లి - రామచంద్ర, తగరపువలస - రాములమ్మ, పాయకరావుపేట - ఎస్వీసీ శ్రీలక్ష్మి, రాజం - ఎస్వీసీ అప్సర, చీపురుపల్లి - వంశీ, బొబ్బిలి - టీబీఆర్ స్క్రీన్ 1, పార్వతీపురం - టీబీఆర్ స్క్రీన్ 1,యలమంచిలి - సీత

నెల్లూరు - ఎం1 సినిమాస్, కావలి - మానస సినిమాస్, సూల్లూరుపేట - వీ ఈపిక్, నాయుడుపేట - సీఎస్ తేజ, వెంకటగిరి - బ్రమర, కందుకూరు - కోటీశ్వర, దర్శి - వెంకటేశ్వర, గూడురు- వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్.

ఈస్ట్.. రాజమండ్రి - గీత అప్సర, రాజమండ్రి - సాయికృష్ణ, కాకినాడ - పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ - దేవి మల్టీప్లెక్స్, అమలాపురం - వెంకటరమణ, మండపేట - రాజరత్న కాంప్లెక్స్, మల్కిపురం - పద్మజ కాంప్లెక్స్, రావులపాలెం - వెంకటేశ్వర, జగ్గంపేట - రాజవేణి, సామర్లకోట - విగ్నేశ్వర, పిఠాపురం - అన్నపూర్ణ, తుని - శ్రీరామ, రామచంద్రపురం - కిషోర్, పెద్దాపురం - లలితా కాంప్లెక్స్, నీలపల్లి - శ్రీసత్య, రాజనగరం - ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక - అన్నపూర్ణ

వెస్ట్.. ఏలూరు - సత్యనారాయణ, భీమవరం - పద్మాలయ, తాడేపల్లిగూడెం - రంగ మహల్, తణుకు - వీరనారాయణ, పాలకొల్లు - మారుతి, నర్సాపురం - అన్నపూర్ణ, జంగారెడ్డి గూడెం - లక్ష్మి, నిడదవోలు -వీరభద్ర, ఆకివీడు - విజయ, గణపవరం - మహాలక్ష్మి, కొవ్వూరు - అనన్య, అత్తిలి - కనకదుర్గ, పెనుగొండ - మినర్వా. 

గుంటూరు.. గుంటూరు - భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ, తెనాలి - లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ - సత్యం, రత్నమహాల్, చిలకలూరుపేట - కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల - రామా టాకీస్, చీరాల - శాంతి థియేటర్. కృష్ణ .. విజయవాడ - అప్సర, శైలజ, మచిలీపట్నం - సిరి వెంకట్, గుడివాడ - జీ3 సింధూర. 

సీడెడ్.. కడప - రవి, అనంతపురం - త్రివేణి, ప్రొద్దుటూరు - అరవీటి, హిందూపురం - గురునాథ్, కర్నూలు - ఎస్వీసీ, నంద్యాల - రామనాథ్, తిరుపతి - సంధ్య,  మదనపల్లి - కృష్ణ, బళ్లారి - నటరాజ్, గుంతకల్ - ఎస్ఎల్వీ, రైల్వే కోడూర్ - ఏఎస్ఆర్, కాళహస్తి - ఆర్ఆర్, చిత్తూరు - విజయలక్ష్మి వంటి థియేటర్లలో ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. దీంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బెలూన్స్ ని ఎగురవేస్తున్నారు. ఒక్కో బెలూన్‌ ఖర్చు ముప్పై వేలని తెలుస్తుంది. 

పవన్‌ హీరోగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పకులు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios