పవన్ ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చే న్యూస్
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది.
త్రివిక్రమ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా ప్రారంభమై పరుగులు పెడుతోంది. ఈ చిత్ర నిర్మాతలు సినిమాని 2021 జనవరి 14న రిలీజ్ చేయటానికి తేదీ ఫిక్స్ చేసిననట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడనుంది.
దాదాపు ఎనిమిది నెలలు విరామం తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. ఆదివారం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక కోర్టు సెట్‌లో పవన్ కళ్యాణ్‌పై సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టు సమాచారం. సినిమాకు కీలకమైన కోర్టు సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారట.ఇదిలా ఉంటే, ‘వకీల్ సాబ్’కు సంబంధించి ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వకీల్ సాబ్’ షూటింగ్ మొదలైన మొదటి రోజే పవన్ కళ్యాణ్ పిక్స్ కొన్ని లీకైన సంగతి తెలిసిందే. వీటి వల్ల పవన్ కళ్యాణ్ లుక్ బయటికి వచ్చేసింది. దీనిపై అప్పట్లోనే నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు.
అయితే, ఇప్పుడు ప్రస్తుతం సినిమాకు కీలకమైన కోర్టు సీన్స్ చిత్రీకరిస్తున్నారు. దాని ఫొటో కూడా ఒకటి బయిటకు వచ్చి వైరల్ అవుతోంది. దాంతో ఇక అలాంటివి లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దిల్ రాజు.‘వకీల్ సాబ్’ పిక్స్, వీడియోలను లీక్ చేసినా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా రూ.5 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించాలని దిల్ రాజు కోర్టులో పిటిషన్ వేసినట్టు పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ లీక్డ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని మెగా అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచంర ఏమీ లేదు.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్ , కెమెరా: పి.ఎస్. వినోద్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి.