పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న చిత్రాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో దశాబ్దం తర్వాత వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కోసం ఎంతో కాలం వెయిట్ చేసిన హరీశ్ శంకర్ ఎట్టకేళలకు గతేడాది డిసెంబర్ మధ్యలో చిత్రాన్ని ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. Ustaad Bhagat Singh కోసం మేకర్స్ భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో గ్రాండ్ గా ఇంటి సెట్ ను కొద్దిరోజులుగా నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాణం పూర్తైంది. ఈ సెట్ లోనే త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని అప్డేట్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్ పై కనుల విందు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ తోపాటుచిత్ర యూనిట్ సెట్ ను పరిశీలిస్తున్న ఫొటోలను పంచుకున్నారు. ఏదేైమనా చిత్రం నుంచి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో పవన్ మరింత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) పవన్ సరసన నటిస్తుందని అంటున్నారు. మరికొంతమంది హీరోయిన్ల పేరు కూడా వినిపిస్తోంది. రాక్ స్టార్ దేవీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’(OG)ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ‘వినోదయ సీతమ్’ రీమేక్ ను కూడా ప్రారంభించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాల్లో పవన్ బిజీగా ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. 

Scroll to load tweet…