పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ సెట్ అయ్యారు. అది కూడా హరిహర వీరమల్లు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. మరి ఏ విషయంలో ఆయన అప్ సెట్ అయ్యాడు..? డైరెక్టర్ క్రిష్ ఏం చేయబోతున్నాడు...?
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ క్రిష్ రూపోందిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలో పవన్ చారిత్రాత్మక కథలో టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర కోసం పవన్ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు. దీనికి సంబందించి యాక్షన్ కొరియోగ్రఫీ ప్రాక్టీస్ వీడియో ఒకటి రిలీజ్ అవ్వగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవర్ స్టార్ ఈసినిమా కోసం ఎంత కష్ట పడుతున్నాడో అందరికి తెలిసింది.
ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ ఈసినిమా నుంచి వినిపిస్తోంది. క్రేజీ గాసిప్ ఒకటి ఫిలింనగర్ సెంటర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మొత్తం పర్ఫెక్ట్ గా అవుతుంది అని సంతృప్తి చెందిన పవన్ కళ్యాణ్, ఓ విషయంలో మాత్రం డిస్సపాయింట్ అయ్యాడట. ఆ విషయంలో ఆయన సంతృప్తికరంగా లేడట. క్రిష్ విజువల్ ఎఫెక్ట్స్, దాని కోసం ఆయనపడ్డ కష్టం, ఏర్పాటు చేసిన సెటప్ అంతా సూపర్ అంటూ పవన్ ఇంప్రెస్ అయ్యాడట. కానీ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ విషయం మాత్రం పవన్ కల్యాణ్ ను డిసప్పాయింట్ చేసిందని టాక్.
ఈ సినిమా మధ్యయుగంలో భారతదేశంలో జరిగిన సంఘటనలు ఎలా ఉంటాయి అనే బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. అయితే దానికి తగ్గట్టు మాత్రం కాస్ట్యూమ్స్ లేవట. మరోవైపు సినిమాలోని పాత్రలు కూడా చాలా మోడ్రన్‌గా, కొత్తగా కనిపిస్తున్నాయని..అసలు లుక్‌ల ఆధారంగానే క్రిష్ కాస్ట్యూమ్స్‌ను ఎక్కువగా డిజైన్ చేశాడని పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దాంతో డైరెక్టర్ క్రిఫ్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అంతా బాగానే ఉంది అనుకున్న టైమ్ లో ఇటువంటి సమస్యలు ఏంటీ అని క్రిష్ మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఇన్ ఫర్మేషన్ ఇవ్వకపోయినా.. క్రిష్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని.. మూవీ టీమ్ ఎదురుచూస్తున్నారట.
ఇక హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. మరో పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చేస్తోంది. వీరితో ప టు బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్ కూడా ఈసినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ చేసిన ఈసినిమాను టాలీవుడ్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
