Pawan -Trivikram Movie: పవన్ కళ్యాణ్ కోసం మాటల మాంత్రికుడి మరో ప్లాన్. ఏం చేస్తున్నాడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో మారో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి పవర్ ఫ్యాన్స్ ను ఊర్రూతలూగించేలా సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Pawan Kalyan, Trivikram Next Movie Update

త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.. ఒక్క అజ్ణాతవాసి వదిలేసతే.. వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో పాటు రీసెంట్ గా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన భీమ్లానాయక్ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్  అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతవరకూ వచ్చిన సినిమాలు ఒక ఎత్తయితే.. ఇప్పుడు అంతకు మించి అన్నట్టు మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని సమాచారం. పవన్ కీ .. త్రివిక్రమ్ కి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే భీమ్లా నాయక్ సినిమా త్రివిక్రమ్ దగ్గరుండి అన్నీ తానై చూసుకున్నాడు.స్క్రీన్ ప్లే తో పాటు మాటలు.. ఒక పాట కూడా రాశాడు త్రివిక్రమ్. అలాంటిది వీరిద్దరి కాంబొలో  పర్ఫెక్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సారి వీరిద్దరు బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ లైన్ చెప్పడం .. పవన్ ఓకే అనడం జరిగిపోయాయట. 

అయితే ఈ నెల 18 నుంచి పవన్ హరి హర వీరమల్లు షెడ్యూల్ షూటింగులో జాయిన్ కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ అయిపోయింది. సూపర్ ఫాస్ట్ గా ఈమూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తరువాత భవదీయుడు భగత్ సింగ్ సినిమాకోసం టైమ్ ఇవ్వబోతున్నాడు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా కంప్లట్ అవ్వగానే  వెంటనే సురేందర్ రెడ్డి సినిమా.. ఆతరువాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెడతాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios