జన సేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా ఓ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. న్యూస్ పేపరు, టీవి ఛానెల్ తమ జనసేన తరుపున పెడితే బాగుంటుందని. వైయస్ జగన్ పార్టీకి  సాక్షి ఎలా ఉపయోగపడుతోందో అదే విధంగా తమ పార్టీకి సంభందించిన అన్ని సంగతులూ కవర్ చేసేందుకు గానూ ఛానెల్,పేపరు ఉంటే మంచిదని భావిస్తున్నారట. ఇప్పటికే 99టీవి, ఆంధ్రప్రభ..జనసేన పార్టికి సపోర్ట్ గా ఉన్నాయి. వాటిని జనసేన లీడర్స్ నడుపుతున్నారు. అయితే అంతగా జనాలను ప్రభావితం చేయలేకపోతున్నాయి. మెయిన్ మీడియాలా వాటిని ఎవరూ భావించటం లేదు , సీరియస్ గా తీసుకోవటం లేదు.

 దాంతో ఈ విషయం గమనించిన పవన్ ..దీనికి ప్రత్యాన్మాయం కావాలని భావిస్తున్నారు. అందుకు బీజీపీ వర్గాలు కూడా సహకారం అందించే అవకాసం ఉంది. అయితే ఇప్పుడు మీడియా పరిస్దితి చాలా అద్వాన్నంగా ఉంది. కరోనా దెబ్బతో చాలా మీడియా సంస్ధలు మూతుపడుతున్నాయి. ప్రింట్ మీడియాపై ఆ ప్రభావం బాగా పడింది. అలాగే టీవి ఛానెల్స్ కూడా కరోనా తో యాడ్స్ రావటం లేదు. జర్నలిస్ట్ లు కూడా ఎవరికి కరోనా సోకుతుందో అనే భయంతో పనిచేస్తున్నారు. ఈ పరిస్దితుల్లో కొత్త ఛానెల్, కొత్త పేపరు అంటే కాస్త కష్టమే. కరోనా కాస్త శాంతించాక వీటి ఆలోచించటం బెస్ట్ అని మీడియాలో అంటున్నారు. 

ఇక పవన్ కళ్యాణ్  వకీల్ సాబ్ ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ క్రేజీ చిత్రం. మిగతా అన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు 2021 కు వాయిదా పడ్డాయి. అందువల్ల వకీల్ సాబ్ పై క్రేజు రెట్టింపైంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 20 రోజులు పైగా షూట్ ఇంకా మిగిలి ఉంది. ఈ పార్ట్ ని చాలావరకు కోర్టు గదిలో షూట్ చెయ్యాల్సి ఉంటుంది. జూన్ 1నుంచి మొదలయ్యే షూటింగులో ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ అవసరం లేని షాట్లు తీస్తారని తెలుస్తోంది. రూల్స్ పాటిస్తూ పరిమిత సిబ్బందితో షూటింగ్ కు సిద్ధమవుతున్నారు.