‘వకీల్ సాబ్’ : పవన్ షాకింగ్ డెసిషన్
ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుతోంది. ఈ సినిమాని సంక్రాంతి 2021 కు రిలీజ్ చేస్తారని ఇప్పటికే మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికి థియోటర్స్ కి జనం ధైర్యంగా వెళ్తారనే నమ్మకం కలిగటం లేదు. ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చినా థియోటర్స్ ఓపెన్ కావటం లేదు. ఓపెన్ అయ్యిన థియోటర్స్ జనం లేక క్లోజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయమై దిల్ రాజుతో డిస్కస్ చేసి దాన్నే ఫైనల్ చేసారట.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుతోంది. ఈ సినిమాని సంక్రాంతి 2021 కు రిలీజ్ చేస్తారని ఇప్పటికే మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికి థియోటర్స్ కి జనం ధైర్యంగా వెళ్తారనే నమ్మకం కలిగటం లేదు. ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చినా థియోటర్స్ ఓపెన్ కావటం లేదు. ఓపెన్ అయ్యిన థియోటర్స్ జనం లేక క్లోజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయమై దిల్ రాజుతో డిస్కస్ చేసి దాన్నే ఫైనల్ చేసారట.
ఇంతకీ ఏమిటా నిర్ణయం అంటే ..సంక్రాతికి ఇంత భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ వద్దన్నారట. కరోనా భయంతో జనం థియోటర్స్ కు రాకపోతే కోట్లలో నష్టం వస్తుంది. అలాగని జనం పొలోమంటూ వచ్చేసినా కరోనా కంట్రోలులో లేకపోతే అది ఫలానా సినిమా వల్ల పెరిగిందనే టాక్ రావచ్చు. ఈ నేపధ్యంలో ఆచి తూచి పవన్ ఆలోచించి,డెసిషన్ తీసుకున్నారట. ఏప్రియల్ 9,2021న రిలీజ్ డేట్ గా పెట్టుకుంటే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ధృవీకరింపబడలేదు.
మరో ప్రక్క ఈ మూవీ టీమ్ నుంచి త్వరలోనే ఏదైనా అప్‌డేట్ వస్తుందని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతవరకు మోషన్ పోస్టర్ తప్ప మరో అప్‌డేట్ లేకపోవటంతో దీపావళికి టీజర్ అయినా వస్తుందన్న ఆశతో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కనిపించటం లేదు. షూటింగ్ స్పీడుగా జరుగుతున్నా.. వకీల్ సాబ్ యూనిట్‌లో అప్‌డేట్ ఇచ్చే మూడ్ మాత్రం కనిపించటం లేదు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయినా ప్రమోషన్ మాత్రం స్టార్ట్ చేయటం లేదు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.