రోజా భర్తకి పవన్ దిమ్మతిరిగే కౌంటర్.. చిన్న స్వభావం నుంచి బయటకు రావాలని హితవు..
ఏపీ మాజీ మంత్రి, నటి రోజా భర్త ఆర్కేసెల్వమణి తమిళ సినిమాలు తమిళనాడులోనే షూటింగ్ జరపాలనే నిబంధన తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు పవన్.

పవన్ కళ్యాణ్ తమిళ చిత్ర పరిశ్రమకి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలు, ముఖ్యంగా ఏపీ మాజీ మంత్రి, నటి రోజా భర్త ఆర్కేసెల్వమణి తమిళ సినిమాలు తమిళనాడులోనే షూటింగ్ జరపాలనే నిబంధన తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు పవన్. తమిళ చిత్ర పరిశ్రమకి విన్నవిస్తూ..`మన చిత్ర పరిశ్రమ అనే ధోరణి నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నా. తెలుగు చిత్ర పరిశ్రమ అందరికి అన్నం పెడుతుంది. అందరిని తీసుకుంటుంది. అలాగే తమిళ చిత్ర పరిశ్రమ కూడా అందరిని తీసుకోవాలి. తమిళ పరిశ్రమ తమిళ వాళ్లకే అంటే పరిశ్రమ ఎదగదు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందంటే అన్ని భాషల వారిని అక్కున చేర్చుకుంటుంద`ని వెల్లడించారు పవన్.
ఆయన ఇంకా చెబుతూ, కేరళ నుంచి వచ్చిన సుజిత్ వాసుదేవన్‌గారు, నార్త్ నుంచి వచ్చిన ఊర్వశి రౌతేలా గారైతేనేమీ, పాకిస్తాన్ నుంచి విభజన సమయంలో వచ్చిన నీతా లుల్లా గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్లు రాణిస్తున్నారు. అన్ని భాషలు, అందరు ఉంటేనే సినిమా అవుతుందని తప్పా, మన భాష, మన వాళ్లే ఉండాలంటే కుంచిచుకుపోతాం. తమిళ సినిమాల షూటింగ్‌లో తమిళ వాళ్లే ఉండాలని, తమిళనాడులోనే షూటింగ్‌లు చేయాలనేది నేను విన్నాను. సముద్రఖని సమక్షంలో చెబుతున్నా, అలాంటి చిన్న స్వభావం నుంచి బయటకు వచ్చి, మీరు కూడా `ఆర్‌ఆర్‌ఆర్` లాంటి ప్రపంచ ప్రఖ్యాతి సినిమాలు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తీసుకురావాలని కోరుకుంటున్నా.
ఒక `రోజా`, ఒక `జెంటిల్‌మెన్` సినిమా వచ్చిందంటే దానికి కారణం ఏఎం రత్నం. ఆయన తెలుగు వారైనా, తమిళంలో గొప్ప సినిమాలు చేశారు. మనం పరిది పెంచుకుంటూ వెళ్దాం. ప్రాంతం, మతం కులం, మనది మనది అనుకుంటే మనుషులం చిన్నోళ్లమైపోతాం. పరిదులు దాటారు కాబట్టే ఏఎం రత్నం ఇలాంటి మంచి సినిమాలు తీసుకొచ్చారు. తమిళ్ పెద్దది కావడానికి కారణం ఏఎం రత్నం. ఆయన తెలుగువారు. అందుకే తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికి కూడా చెబుతున్నా పరిధి దాటి చూడండి. నిజంగా స్థానికంగా కార్మికులకు సమస్యలుంటే వారికి కచ్చితంగా ఫీడింగ్ ఉండాలి, దాన్ని ఇంకోరకంగా ఆలోచించాలి తప్ప, ఒక కళాకారుడికి కులం, మతం, ప్రాంతమంటే పరిశ్రమ ఎదగదు. దాన్ని దాటి ఆలోచించాలని తమిళ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా` అని అన్నారు పవన్ కళ్యాణ్.
`బ్రో` ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) దక్షిణ్ సమ్మిట్‌లో రోజా భర్త, దర్శకులు ఆర్‌కే సెల్వమణి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమాలు తమిళనాడులోనే షూటింగ్ చేసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు చేస్తున్నారని, ముఖ్యంగా హైదరాబాద్‌లో షూటింగ్‌లు ఎందుకు అని ఆయన అన్నారు. అంతేకాదు తమిళ సినిమాల్లో తమిళ ఆర్టిస్టులు,టెక్నీషియన్లనే తీసుకోవాలనే వాదన లేవనెత్తారు. ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున్న చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో రోజా భర్తకి కౌంటర్‌గా పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.