చంద్రయాన్‌ 3 సక్సెస్‌ కావడానికి ముఖ్యమైన ఇస్రోకి అందరు అభినందనలు తెలియజేస్తున్నారు. రాజకీయ ప్రముఖుల ఉనంచి సెలబ్రిటీల వరకు సోషల్‌ మీడియా ద్వారా, మీడియా ద్వారా తమ అభినందనలు తెలిపారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. 

ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ 3 సక్సెస్‌ అయ్యింది. మన రాకెట్‌ సేఫ్‌గా చంద్రుడిపై ల్యాండ్‌ అయ్యింది. దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ అయిన తొలి అంతరిక్ష నౌక మనది కావడం విశేషం.దీంతో ఇండియా చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై రాకెట్‌ని లాంచ్‌ చేసిన అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఇండియా నాల్గో స్థానంలో నిలిచింది. ఈ చంద్రయాన్‌ 3 విజయం ప్రపంచానికి ఇండియా సత్తా ఏంటో చాటి చెబుతుంది. 

ఈ నేపథ్యంలో చంద్రయాన్‌ 3 సక్సెస్‌ కావడానికి ముఖ్యమైన ఇస్రోకి అందరు అభినందనలు తెలియజేస్తున్నారు. రాజకీయ ప్రముఖుల ఉనంచి సెలబ్రిటీల వరకు సోషల్‌ మీడియా ద్వారా, మీడియా ద్వారా తమ అభినందనలు తెలిపారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. చంద్రయాన్‌ 3 విజయం పట్ల తనదైన స్టయిల్‌లో రెస్పాండ్‌ అయ్యారు. సైకిల్‌ నుంచి చంద్రయాన్‌3 వరకు అంటూ ఆయన వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు. 

ఇస్రో పరిశోధనల కోసం, మొదట్లో రాకెట్‌ తయారీకి, విడిభాగాలను ఇస్రో సెంటర్‌కి సైకిళ్లు, ఎండ్ల బండ్ల మీద తరలించేవారు. అప్పట్లో ఆ గ్రామాలు కళ్లు కూడా తెరవలేదు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు చంద్రయాన్‌ 3 రాకెట్‌ని పంపించి సక్సెస్‌ అయ్యే స్థితికి చేరుకున్నాం. ఇది మన విజయం అని పవన్‌ తెలిపారు.

`భారతదేశం అంతరిక్ష ప్రయాణం నిజంగా హద్దులేని అభిరుచి, పట్టుదలకు సంబంధించిన స్టోరీ. నిద్రలో ఉన్న గ్రామంలో సైకిళ్లు, ఎద్దుల బండ్లను ఉపయోగించి రాకెట్‌ భాగాలను అసెంబ్లింగ్‌ చేయడం, నుంచి ఈ రోజు భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకని విజయవంతంగా దింపిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది. చంద్రయాన్‌ 3 భారతదేశం నేతృత్వంలోని మొత్తం మనవాళికి ఒక చారిత్రాత్మక క్షణం. ఈ అద్భుతమైన విజయానికి మన శాస్త్రవేత్తలందరికీ, వారిని ప్రోత్సహించిన వారి కుటుంబాలకు, దేశ ప్రధానులు, ఇప్పటి ప్రధాని మోడీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా` అని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌. జవరహార్‌ లాల్‌ నెహ్రూ నుంచి మోడీ వరకు అందరిని మెన్షన్‌ చేస్తూ, అలాగే ఇస్రో చైర్మెన్లకి పవన్‌ అభినందనలు, ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. 

View post on Instagram

పవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఇటీవలే వచ్చారు. దీంతో ఆయన ఏం పోస్ట్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇన్‌స్టా పోస్ట్ ప్రారంభించిన గంటలోనే మిలియన్‌ ఫాలోవర్స్ వచ్చారు. అతి తక్కువ టైమ్‌లో ఇంతటి ఫాలోవర్స్ ఏర్పడిన అకౌంట్‌గా రికార్డు క్రియేట్‌ చేసింది. మొదట్లో ఆయన చిత్ర పరిశ్రమ పెద్దలు, తనతో పనిచేసిన వారికి, రాజకీయ ప్రముఖులకు ఇలా అందరికి పవన్‌ థ్యాంక్స్ చెప్పారు. తర్వాత గద్దర్‌ని గుర్తు చేసుకుంటూ పెట్టారు. అన్నయ్య చిరంజీవికి విశెష్‌ చెప్పారు. ఇప్పుడు చంద్రయాన్‌ 3 సక్సెస్‌పై పోస్ట్ పెట్టడం విశేషం.