పవర్ స్టార్ పవ్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మల్టీ టాలెంటెడ్ అని మరో సారి నిరూపించుకున్నాడు. సినిమాలు ఇంట్రెస్ట్ లేవు అంటూనే.. ఫైట్స్, డాన్స్, మ్యూజిక్ తో పాటు నటనలో కూడా ట్రైయినింగ్ తీసుకుంటున్న అకీరా.. రీసెంట్ గా మరో టాలెంట్ ను బయట పెట్టాడు. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌న‌యుడు అకీరా నంద‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. పవర్ స్టార్ వారసుడిగా.. అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆమధ్య అకీరాకు సినిమాల్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదు అంటూ రేణు దేశాయ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. కాని పరిస్థితి చూస్తే.. అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కావల్సిన ట్రైయినింగ్ మొత్తం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే న‌ట‌న‌పై శిక్ష‌ణను తీసుకుంటున్న స్టార్ కిడ్.. కర్రసాము, మార్షల్ ఆర్ట్స్, డాన్స్ తో పాటు మ్యూజిక్ కూడా నేర్చేసుకున్నాడు. ఇదిలా ఉంటే అకీరా టాలెంట్ గురించి అంద‌రికి తెలిసిందే. పవన్ తనయుడికి సంగీతంపైన కూడా మ‌క్కువ ఎక్క‌వే. 

ఈ క్ర‌మంలో తాజాగా అకీరా ఓ పాటను కంపోజ్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. హృద‌యమా అంటూ సాగే ..పాట‌ను కీ బోర్డ్‌తో కంపోజ్ చేశాడు. ఈ పాట అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాలోది. ఇక ఈ వీడియోను అడివి శేష్ స్వయంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అది వైర‌ల్‌గా మారింది.అడివిశేష్ ట్విట్ట‌ర్‌లో శేర్ చేస్తూ.. చిన్న నోట్ రాశాడు. ఈ పాట‌ను కంపోజ్ చేసి పంపినందుకు థ్యాంక్యూ అకీరా అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ విడియో క్షణాల్లో వైరల్ అవుతోంది. 

Scroll to load tweet…

ఈ వీడియోపై ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. జూనియర్ పవర్ స్టార్ అంటూ అకీరాను అభినందిస్తున్నారు. గ‌తంలో కూడా అకీరా త‌న స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని దోస్తీ సాంగ్‌ను పియానోలో వాయించి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు. త‌న‌లో ఈ టాలెంట్ కూడా ఉందా అని అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు.