బ్రో మూవీ కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పవన్ సాయితేజ్ లకు( Pawan Saitej ) ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఎలాంటి డ్రెస్ వేసినా దాని గురించే చర్చ. మొదటి నుంచి కూడా పవన్.. కొత్తవాటిని డిస్కవర్ చేయడంలో ముందు ఉంటాడు. అది బైక్స్ అయినా, షూస్ అయినా.. డ్రెసింగ్ స్టైల్ అయినా.. అందుకే గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది.. ” నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను” అని.. పవన్ చెప్పిన విధంగానే ఆయన ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి పవన్ కొత్త ట్రెండ్ ను సెట్ చేశాడు.
ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నేడు.. పవన్, తేజ్ కలిసి ఉన్న పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. సినిమాలో మామా అల్లుళ్లు పవన్, సాయి తేజ్ కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. బైక్‌పై కాలుపెట్టిన పవన్ స్టయిల్ లుక్ ఇవ్వగా.. వెనకాల సాయితేజ్ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఇద్దరూ క్లాస్ లుక్ లో కనిపిస్తున్నారు.
అయితే ఈ పోస్టర్ లో హైలైట్ గా నిలిచాయి పవన్ షూస్. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబోలో ఉన్న ఈ షూస్ ప్రస్తుతం కుర్రకారును తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.దీంతో ఆ షూస్ రేట్ ఎంత అని సెర్చ్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇవి బాల్మైన్ అనే ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన షూస్.. వాటి విలువ అక్షరాలా.. లక్షా ఆరువేల డెబ్భై రూపాయలు.
బ్రో సినిమా కోసం బాల్మేన్ కంపెనీకి చెందిన మూడు జతల షూలను పవన్ కోసం ప్రత్యేకంగా తెప్పించారని సమాచారం..పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం.
ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్ర పోషించగా, సాయి తేజ్ మార్క్ అనే యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మూల కథలో త్రివిక్రమ్ పలు మార్పులు చేసిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జులై 28న విడుదల కానుంది. మరోవైపు విరూపాక్షతో సాయితేజ్ తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా.. పవన్ ‘బ్రో’తో పాటు నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
