Asianet News TeluguAsianet News Telugu

OG : ఫెస్టివల్ ట్రీట్.. ‘ఓజీ’ నుంచి పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్టర్..

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ OG  నుంచి ఫెస్టివల్ ట్రీట్ అందింది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది యూనిట్.

Pawan Kalyan's OG movie Special Poster NSK
Author
First Published Oct 23, 2023, 4:34 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఫెస్టివల్ ట్రీట్ అందింది. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడాఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఫిల్మ్ OG శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ అలరించబోతున్న చిత్రమిదే. ఈ భారీ ప్రాజెక్ట్ కు యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి వర్క్ చేస్తుండటం విశేషం.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్  అదిరిపోయాయి. పోస్టర్లు, గ్లింప్స్  ఆసక్తిని పెంచాయి. మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి. దసరా ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు ఆయుధ పూజా, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆయుధాలకంటే అతని కంటిచూపు చాలా పవర్ ఫుల్’ అనే లైన్ తో పోస్టర్ విడుదలైంది.  

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. 1950ల బ్యాక్‍డ్రాప్‍లో రూపొందుతోందని ప్రచారం. యాక్షన్ థ్రిల్లర్ మూవీని డీవీవీ దానయ్య నిర్మాతగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రీసెంట్ షెడ్యూల్ థాయిలాండ్ లో జరిగింది. చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) నటిస్తోంది. తమిళ నటుడు అర్జున్ దాస్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మిన్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇక పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్స్., పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’, హరీశ్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మరో  సురేందర్ రెడ్డితో మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇలా పవన్ సినిమాలు, రాజకీయ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 

Pawan Kalyan's OG movie Special Poster NSK

Follow Us:
Download App:
  • android
  • ios