పవన్ కళ్యాణ్ తో విడిపోయినా తననే ప్రేమిస్తానంటున్న రేణు దేశాయ్ రేణు దేశాయి తో పవన్ కూతురు ఆసక్తికర ప్రశ్న తండ్రి సినిమాలు చూసి నువ్వెందుకు చేయవని అమ్మను అడిగుతోందట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి చెప్పగలిగే ఏకైక వ్యక్తి పవన్ మాజీ భార్య రేణు దేశాయే. మహిళల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి.. పిల్లల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది రేణు. పవన్ కూతురు ఆధ్య తనను అడిగిన ఓ విషయం గురించి రేణు ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఒకసారి ఆధ్య తన దగ్గరికి వచ్చి ‘నాన్న సినిమాలు చేస్తున్నారు కదా. మరి నువ్వెందుకు చేయట్లేదు’ అని అడిగిందట.

తన కూతురికి సమాధానంగా ‘నువ్వు పెద్దయి బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకో అప్పుడు నేను సినిమాలు చేస్తా’ అని బదులిచ్చానని చెప్పింది రేణు. తన తండ్రి సినిమాలను ఆధ్య.. అకీరా ఇద్దరూ ఆసక్తిగా చూస్తారని రేణు తెలిపింది. పవన్ నుంచి విడిపోయినప్పటికీ తనను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని.. అందుకే రెండో పెళ్లి చేసుకోనని రేణు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ ఆరు నెలలకు ఓసారి తమ దగ్గరికి వస్తుంటాడని.. ఆ సమయంలో పిల్లలో ఉల్లాసంగా గడుపుతాడని.. డిన్నర్ చేస్తాడని రేణు తెలిపింది.