ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ సినిమాకి `భీమ్లా నాయక్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పవన్‌ పాత్ర ప్రధానంగా ఇది సాగుతుంది. ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు, పవర్‌ స్టార్‌ అభిమానులకు పర్‌ఫెక్ట్ ట్రీట్‌ అని చెప్పొచ్చు. 

పవన్‌ కళ్యాణ్‌, రానా హీరోలుగా ఓ చిత్రం రూపొందుతుంది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇది మలయాళ సూపర్‌ హిట్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`కి రీమేక్‌. ఇందులో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన పాత్ర లుక్‌, చిత్ర మేకింగ్‌ వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. 

తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ సినిమాకి `భీమ్లా నాయక్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పవన్‌ పాత్ర ప్రధానంగా ఇది సాగుతుంది. ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు, పవర్‌ స్టార్‌ అభిమానులకు పర్‌ఫెక్ట్ ట్రీట్‌ అని చెప్పొచ్చు. ఇందులో రానా `డానియెల్‌ శేఖర్‌`గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. అయితే వాయిస్‌ ఓవర్‌లో ఆయన తన పేరు చెప్పగా, పవన్‌ తన పేరుని `భీమ్లా నాయక్‌` అని చెప్పడం అదే టైటిల్‌గా పెట్టడం విశేషం. 

ఇక ఫస్ట్ గ్లింప్స్ లో పవన్‌ హవానే సాగింది. సినిమా ప్రారంభం నుంచి పవన్‌ పాత్రని హైలైట్‌ చేస్తూ మేకింగ్‌ వీడియోని, ప్రీ లుక్‌లను విడుదల చేస్తూ వస్తున్నారు. రానాని ఎక్కడా చూపించడం లేదు. దీంతో ఇది పవన్‌ సినిమాగానే ప్రమోట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో రానాకి అన్యాయమే జరుగుతుందని చెప్పొచ్చు. మలయాళంలో రెండు పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. టైటిల్‌ కూడా వారిద్దరి పాత్రల పేర్లని మిక్స్ చేసి పెట్టారు. కానీ ఇందులో పవర్‌స్టార్‌ని హైలైట్‌గా చూపిస్తుండటం, టైటిల్‌ కూడా పవన్‌ పాత్ర పేరు ప్రధానంగానే పెట్టడం గమనార్హం. ఇది రానా ఫ్యాన్స్ ని హర్ట్ చేసేలా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

 ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్‌ 2న పాటని విడుదల చేయబోతున్నారట.