పవన్-రానా సినిమా టైటిల్ ఇదే?

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాల దర్శకుడు సాగర్ చంద్ర రూపొందిస్తున్నాడు. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన అయ్యప్ప పాత్రను పవన్ చేస్తుండగా.. పృథ్వీరాజ్ పోషించిన కోషీ క్యారెక్టర్లో రానా కనిపించనున్నాడు.

Pawan Kalyan rana movie title fix?! jsp

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్న సంగతి తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మళయాళ ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన అయ్యప్ప పాత్రను పవన్ చేస్తుండగా.. పృథ్వీరాజ్ పోషించిన కోషీ క్యారెక్టర్లో రానా కనిపించనున్నాడు.సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.   

కరోనా సెకండ్ వేవ్ తో ఈ సినిమా బాగా ఆలస్యం అయ్యిపోయింది. ఈ సినిమాను లాస్ట్ ఇయిర్ మొదలెట్టినా .. సగం షూటింగ్ మాత్రమే పూర్తి చేసారు. అలాగే ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు టైటిల్ సెట్ చేసినట్లు సమాచారం.  పరశురామ కృష్ణమూర్తి అనే పేరును ఈ చిత్రానికి ఫైనల్ చేసినట్లు  వినపడుతోంది. మలయాళంలో మాదిరే మెయిన్ క్యారక్టర్స్ ఇద్దరి  పేర్ల ఆధారంగానే ఈ టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అయితే పరశురామ్ పేరు పవన్ కళ్యా ణ్ కు ఉండచ్చని, రానా పాత్ర పేరు కృష్ణమూర్తి అయి అవచ్చు అని చెప్పుకుంటున్నారు. రచన   చేస్తున్నది త్రివిక్రమ్‌... కాబట్టి టైటిల్ కూడా ఆయనే పెట్టి ఉండొచ్చుని చెప్తున్నారు.  కిల్లర్‌ కాంబో అంటూ అటు పవన్‌, ఇటు రానా అభిమానులు సోషల్‌ మీడియాలో  సందడి చేస్తున్నారు. వారికీ ఈ టైటిల్ నచ్చచ్చు.

ఇక గత కొద్ది నెలలు గా పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నా పబ్లిక్ లోకి రాలేదు. అయితే ఆయన తన షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయటంతో నిర్మాతలు షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్ సైతం సాగర్ చంద్ర సినిమా షూట్ మొదలెట్టమని చెప్పారట. ఈ సినిమా మేజర్ పార్ట్ షూట్ హైదరాబాద్ అల్యూమినియం పాక్టరీలో జరిగింది. అక్కడ వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేసారు. ఇప్పుడు అక్కడ తిరిగి కంటిన్యూ చేయబోతున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ సెట్ లో సీన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. జూలై రెండవ వారం నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios