పవన్ కళ్యాణ్ రహస్యంగా సినిమాని స్టార్ట్ చేయడమేంటనేది చర్చనీయాంశమవుతుంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన ఫ్యాన్స్ కి సైలెంట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన సైలెంట్‌గా కొత్త సినిమాని స్టార్ట్ చేశారట. బయటకు తెలియకుండా కేవలం చిత్ర యూనిట్ సమక్షంలోనే ప్రారంభ కార్యక్రమాలు జరిగాయట. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ రహస్యంగా సినిమాని స్టార్ట్ చేయడమేంటనేది చర్చనీయాంశమవుతుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం `హరిహర వీరమల్లు`(Harihara Veeramallu) చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ దర్శత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న చిత్రమిది. ఇంకా నలభై శాతం చిత్రీకరణ పెండింగ్‌లో ఉందని తెలుస్తుంది. అనేక సార్లు ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. భారీ స్కేల్ ఉన్న చిత్రం కావడం, పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రానికి చాలా టైమ్ పడుతుందట. పైగా పవన్ మధ్యలో తన జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో మరింత ఆలస్యమవుతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే పవన్ త్వరలోనే మళ్లీ రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. అక్టోబర్ తర్వాత ఆయన పూర్తిగా పొలిటికల్ ప్రచారంలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒప్పుకున్న చిత్రాలను ఫాస్ట్ గా పూర్తి చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా పవన్ ఇటీవల మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో సముద్రఖని రూపొందిస్తూ కీలక పాత్రలో నటించిన `వినోదయ సిత్తం`(Vinodhaya Sittam) అక్కడ మంచి విజయాన్ని సాధించింది.
`వినోదయ సిత్తం` సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు ఓకే చెప్పారు పవన్. మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి ఆయన ఈ సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాని సైలెంట్‌గా ప్రారంభించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ మళ్లీ రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసి అభిమానుల నుంచి కొన్ని నెగటివ్ కామెంట్లు వచ్చాయి. వారికి ఇష్టం లేదనే టాక్ వినిపించింది.
పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా విషయంలో ఆర్భాటాలు అవసరం లేదని భావించారట పవన్. అందుకే సైలెంట్‌గా సినిమాని ప్రారంభించారని తెలుస్తుంది. వచ్చే నెలలో రెగ్యూలర్ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారట. ఈ చిత్రానికి ఆయన దాదాపు 30 రోజుల డేట్స్ ఇచ్చారని సమాచారం. ఆగస్ట్ వరకు ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు పవన్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్ సింగ్` చిత్రం చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఉండబోతుందనేది పెద్ద సస్పెన్స్ గానూ మారింది.
