పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల కాస్తా సంగ్ధిద్ధత ఏర్పడిన  విషయం తెలిసిందే. అయితే క్రిష్ - పవన్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రంపై తాజాగా క్రేజీ న్యూస్ అందుతోంది. మూవీ మళ్లీ షురూ కానున్నట్టు తెలుస్తోంది.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - దర్శకుడు క్రిష్ జాగర్లముడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). రెండేండ్ల కింద నుంచే చిత్రం షూటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాకు అడ్డంకులు ఏర్పడుతూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ వెదర్ లో ఎక్కువ సమయం గడుపుతుండటంతో.. సినిమా షూటింగ్ లకు సమయం దొరకడం లేదు. ‘చివరిగా భీమ్లా నాయక్ తో అలరించి పవన్ స్టార్ నెక్ట్స్ ‘భీమ్లా నాయక్’తోనే అలరించనున్నారు. ఈ చిత్రం కోసం ఇటు అభిమానులు, ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదరుచూస్తున్నారు. 

అయితే గత కొద్ది రోజులుగా క్రిష్ కు - పవన్ కు మధ్య చెడటంతో సినిమా ఆగిపోయిందని, తదితర కారణాలతో సినిమా ముందుకు సాగడం లేదనే వార్తలు గట్టిగానే ప్రచారం జరుగుతున్నాయి. ఇటీవల నిర్మాత ఏఎం రత్నం వాటికి చెక్ పెట్టారు. సినిమా షూట్ జరుగుతుందని చెప్పారు. వచ్చే ఏడాది 2023లో మార్చి 10న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈచిత్రంపై మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ జరుపుకోచ్చని నిర్మాత దిల్ రాజ్ ప్రకటించగా.. ‘హరి హర వీరమల్లు’పై అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది. 

సెప్టెంబర్ మొదటి వారంలోనే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని దర్శకుడు క్రిష్ (Krish) భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు యూనిట్ కూడా సంసిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో తదుపరి షెడ్యూల్ కొనసాగింపుగా క్రిష్ భారీ సెట్ వేయిస్తున్నారట. ఇప్పటికీ నుంచి షూట్ రెగ్యూలర్ గా కొనసాగుతుందని తెలుపుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా 20 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈసారైనా షూటింగ్ పూర్తి చేస్తారా? లేకా మరేదైనా సమస్యతో ఆగిపోతారా అన్నది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ టాక్ ప్రకారం.. చిత్రాన్ని వీలైనంత త్వరగా ముగించాలనే చూస్తున్నట్టు తెలుస్తోంది. 

17వ శతాబ్దంలోని మొఘల్ ల సామ్రాజ్యం నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇది మూవీ పీరియడ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లముడి (Krish) డైరెక్ట్ చేస్తుండగా.. పవన్ కళ్యాణ్ - హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) జంటగా నటిస్తున్నారు. పలు కీలక పాత్రల్లో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కనిపించబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై చిత్రం రూపొందుతుండగా ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.