మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా చిత్రలహరి పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. అయితే ఈ సినిమాను జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వీక్షించారు. ఆంధ్ర పాలిటిక్స్ నుంచి బయటకు రాగానే పవర్ స్టార్ చూసిన మొదటి సినిమా ఇదే. 

అయితే సినిమా మేకింగ్ కు ఫిదా అయిన పవర్ స్టార్ చిత్ర యూనిట్ తన అభినందనలు తెలియజేశాడు. అంతే కాకుండా స్పెషల్ గా  చిత్ర యూనిట్‌కు ఫ్ల‌వ‌ర్ బొకెల‌ను పంపారు. `కంగ్రాట్స్ .. మీ వ‌ర్క్‌ను నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను` అంటూ మెసేజ్ అందించారు. 

ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి సినిమాను చూసి వీడియో బైట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా ఏళ్ల తరువాత ఒక మంచి పాజిటివ్ హిట్ ను అందుకున్నాడని చెప్పవచ్చు.