`పీఎస్‌పీకే27` వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులోని పవన్‌ లుక్‌ లీకైంది.

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. `పీఎస్‌పీకే27` వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి `హరహర మహదేవ` అనే టైటిల్‌ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి పవన్‌ లుక్‌ లీక్‌ అయ్యింది. 

సెట్లో పవన్‌ నడుచుకుంటూ వస్తున్న లుక్‌ ఇది. జానపద తరహా దుస్తులుధరించారు. పీరియాడికల్‌గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. బందిపోటు రాబిన్‌ హుడ్‌ పాత్ర తరహాలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. పీరియాడికల్‌ లుక్‌ కోసం ఇలా పవన్‌ ముస్తాబైనట్టు తెలుస్తుంది. పవన్‌ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. బందిపోటుని పోలినట్టుగా ఆయన గెటప్‌ ఉండటం విశేషం. కథపై, ఆయన పాత్రపై మరింత క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. తాజాగా దీన్ని పవన్‌ అభిమానులు తెగ వైరల్‌ చేస్తున్నారు. ఆయన లుక్‌ని చూసి ఖుషీ అవుతూ, లైక్‌లు, షేర్లలతో ట్రెండ్‌ చేస్తున్నారు. 

ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయబోతున్నారు. ఇందులో నిధితోపాటు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ మరో హీరోయిన్‌గా నటించనుందట. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీంతోపాటు పవన్‌ మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో రానా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.