పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడుకు డేట్ ఫిక్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన కాటమరాయుడు టీమ్ ఉగాది సందర్భంగా మార్చి 29న రిలీజ్
పవర్ స్టార్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు మూవీని.. డిసెంబర్ కల్లా షూటింగ్ అంతా పూర్తి చేసి, వేసవి సీజన్ మొదట్లో విడుదల చేయాలని టీం మొదట్నుంచీ ప్లాన్ చేసింది. అందుకు అనుగునంగానే తాజాగా ఒక విడుదల తేదీని కూడా ఖరారు చేశారు.
పవన్ కాటమరాయుడు మూవీని ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఇక కాటమరాయుడు మార్చిలో విడుదలకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో మిగిలిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయనేది చూడాలి. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న కాటమరాయుడు సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
