Asianet News TeluguAsianet News Telugu

‘OG’తో పవన్ కు ముట్టేదెంతో తెలిస్తే మైండ్ బ్లాక్

ప్రక్క పవన్ కల్యాణ్ హీరోగా.. సుజిత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని ఈ  ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Pawan Kalyan is charging Rs 100 crores as remuneration for OG
Author
First Published May 31, 2023, 1:24 PM IST | Last Updated May 31, 2023, 1:24 PM IST


పవన్ కళ్యాణ్...యంగ్ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' పై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.  అదిరిపోయే కాంబినేషన్‌లో రాబోతున్న ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌  ముంబై నగరంలో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. అవుట్ ఫుట్ అద్భుతంగా రావటంతో టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది . అంతేకాదు, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్‌ప్రైజింగ్  వార్త బయిటకు వచ్చింది.

ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మతిపోయేలా ఉంది. ఈ సినిమా నిమిత్తం పవన్ కు 100 కోట్ల నిర్మాత డివివి దానయ్య ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మొదటి నుంచి చివరి దాకా త్రివిక్రమ్ డీల్ చేసి సెట్ చేసారని, ఆయనకు ఇంతని ఎమౌంట్ ఇస్తున్నారని తెలుస్తోంది.  దాంతో ఈ సినిమా రైట్స్ బాగా ఎక్కువ ఉండనున్నాయి. ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ కు ఓటిటి సంస్దల నుంచి, టీవి ఛానెల్స్ నుంచి పోటీ విపరీతంగా ఉందని సమాచారం. అయితే దానయ్య చెప్పే రేట్లుతో ఇంకా నెగోషియేషన్స్ జరుగుతన్నాయని, ఇంకా డీల్ ఫైనల్ కాలేదని అంటున్నారు. 

మరో ప్రక్క పవన్ కల్యాణ్ హీరోగా.. సుజిత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని ఈ  ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దీన్ని క్రిస్మస్ కానుకగా మూడు రోజుల ముందుగానే అంటే డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలిసింది. శుక్రవారం నుంచి సోమవారం వరకూ సెలవులు ఉండడం వల్లే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం.  

గ్యాంగ్‌స్టర్‌ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్‌ మూడు విభిన్న వేరేయేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట. ఒకటి టీనేజర్‌ కాగా, రెండు కాలేజీ స్టూడెంట్‌ , మూడు డాన్‌ ఇలా మూడు విభిన్న పాత్రలతో కనిపించనున్నాడని సమాచారం.  ఈ సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios